ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​నకు వచ్చే వారిని నిర్బంధించండి'

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​నకు వచ్చే ఆటగాళ్లను ఐసోలేషన్​లో ఉంచాలంటున్నాడు దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ డుప్లెసిస్​. టోర్నీకి ముందు, తర్వాత రెండు వారాల పాటు క్రికెటర్లను నిర్బంధించమని సూచించాడు.

Du Plessis suggests two-week isolation period for players before and after T20 WC
'టీ20 ప్రపంచకప్​కు వచ్చే వాళ్లను నిర్బంధించండి'
author img

By

Published : May 14, 2020, 4:06 PM IST

టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే ఆటగాళ్లను కనీసం రెండు వారాలు ఐసోలేషన్​లో ఉంచాలని దక్షిణాఫ్రికా బ్యాట్స్​మన్​ డుప్లెసిస్​ అంటున్నాడు. ఈ ఏడాది జరిగే టోర్నీ ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత క్వారంటైన్​లో ఉంచాలని తెలిపాడు. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో వరల్డ్​కప్ జరగాల్సి ఉంది.

"ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేయడం కొన్ని దేశాలకు సమస్యగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇతర దేశాల మాదిరిగా ఆస్ట్రేలియా కరోనాకు ఎక్కువగా ప్రభావితం కాకపోయినా.. బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా, భారత్​ వంటి దేశాల నుంచి ప్రయాణం చేయడం ప్రమాదకరమైనదే. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్​లో పాల్గొనడానికి వస్తోన్న ఆటగాళ్లను టోర్నీకి ముందు, తర్వాత రెండు వారాలు ఐసోలేషన్​లో ఉంచితే సరిపోతుంది. కానీ, ప్రయాణాలపై నిషేధాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎప్పుడు ఎత్తివేస్తుందో తెలియదు. ఎందుకంటే పాత రోజుల్లాగా సముద్ర ప్రయాణం చేయలేం కదా".

-డుప్లెసిస్​, దక్షిణాఫ్రికా క్రికెటర్​

మార్చిలో మూడు వన్డేల సిరీస్​లో పాల్గొనడానికి భారత్​కు వచ్చిన సఫారీ జట్టు.. ఒక్క మ్యాచ్​ ఆడిన తర్వాత కరోనా ఉధృతి కారణంగా తిరుగుముఖం పట్టింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 44 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. 3 లక్షల మంది మరణించారు.

ఇదీ చూడండి.. ఖేల్​రత్నకు అంజుమ్​.. ద్రోణాచార్యకు రాణా నామినేట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.