ETV Bharat / sports

'బ్యాటింగ్​లో కోహ్లీ-స్మిత్​కు ఉన్న తేడా అదే'​ - కోహ్లీ తాజా వార్తలు

పరుగులు రాబట్టే విధానంలో కోహ్లీతో పోల్చుకుంటే స్మిత్ శైలి వేరుగా ఉంటుందని చెప్పాడు ఆసీస్ క్రికెటర్ వార్నర్.

'బ్యాటింగ్​లో కోహ్లీ-స్మిత్​కు ఉన్న తేడా అదే'​
కోహ్లీ-స్మిత్
author img

By

Published : May 7, 2020, 5:56 AM IST

Updated : May 7, 2020, 7:44 AM IST

ప్రస్తుత క్రికెట్​లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ ఇద్దరూ ఇద్దరే. ఫార్మాట్​ ఏదైనా సరే బ్యాటింగ్​లో ఆకట్టుకుంటున్నారు. అయితే వీరిద్దరూ పరుగులు చేసే విధానం వేరువేరుగా ఉంటుందని చెప్పాడు డేవిడ్ వార్నర్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

"విరాట్ క్రీజులోకి వచ్చిన తర్వాత కొంతసేపు నెమ్మదిగా ఆడతాడు. ఆ తర్వాత బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడు. కానీ స్మిత్ మాత్రం వచ్చిరాగానే బంతిని బాదేయాలని అనుకుంటాడు. అతడు ఆటను ఎంతో ఆస్వాదిస్తాడు. వీరిద్దరూ అసలు ఔట్ కాకుడదనే క్రీజులోకి అడుగుపెడతారు. కోహ్లీ పరుగులు రాబట్టే విధానంతో పోలిస్తే స్మిత్ శైలి వేరుగా ఉంటుంది" -డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్

వీరిద్దరూ మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసినప్పుడు, మిగతా సభ్యుల్లోనూ మానసిక స్థైర్యం పెరుగుతుందని వార్నర్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో హైదరాబాద్​కు ఆడాల్సిన ఇతడు.. లాక్​డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్నాడు. పలు టిక్​టాక్ వీడియోలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు.

Last Updated : May 7, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.