ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో విజయ్ శంకర్‌కు ఆల్‌రౌండర్ కోటాలో అవకాశం దక్కింది. స్పందించిన ఈ క్రికెటర్.. తన కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఐపీఎల్లో సహచర ఆటగాళ్లను చూసి నేర్చుకున్నానని చెప్పాడు.
''ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో నాకు చోటు దక్కింది. నా కల సాకారమైంది. ప్రపంచకప్ ఆడిన అనుభవమున్న పలు దేశాల క్రికెటర్లు సన్‌రైజర్స్ జట్టులో ఉన్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. మెగాటోర్నీలో ఆడేటపుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
-విజయ్ శంకర్, భారత క్రికెటర్
శంకర్.. టీమిండియా తరఫున 9 వన్డేలు ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. పేస్ బౌలింగ్ చేయగలడు. గత నెల.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఇది చదవండి: టీమిండియా చతుర్ముఖ వ్యూహమిదే...