ETV Bharat / sports

ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ ఎలెవన్​' ఖరారు - ఐపీఎల్ 13 వ సీజన్

ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ ఎలెవన్​' ఖరారు

author img

By

Published : Aug 18, 2020, 2:54 PM IST

Updated : Aug 18, 2020, 3:25 PM IST

14:48 August 18

ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ ఎలెవన్​' ఖరారు

ఐపీఎల్​ 13వ సీజన్​ టైటిల్ స్పాన్సర్​షిప్​ హక్కులను డ్రీమ్​ ఎలెవన్​ దక్కించుకుంది. ఇందుకోసం దాదాపు రూ.222 కోట్ల భారీ మొత్తం చెల్లించినట్లు ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ తెలిపారు. ఈ రేసులో టాటా మోటార్స్​, అన్​ అకాడమీ, పతంజలి, రిలయన్స్​, బైజూస్​ వంటి సంస్థలు పోటీపడ్డాయి.

భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ నుంచి వివో తప్పుకుంది. దీంతో కొత్త స్పాన్సర్ కోసం ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. తాజాగా ఎక్కువ మొత్తంలో బిడ్ దాఖలు చేసిన డ్రీమ్​ ఎలెవన్​ను ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్​గా ప్రకటించారు.

సెప్టెంబర్​ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది. నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగబోతుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేశాయి.

Last Updated : Aug 18, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.