ఐపీఎల్ 13వ సీజన్ కోసం దుబాయ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాగా కష్టపడుతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగుతోంది. ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో ఉన్న కోహ్లీసేన ప్రతీకూల పరిస్థితుల మధ్య తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే పేసర్ ఉమేశ్ యాదవ్ గురించి పలు ఆసక్తికర విశేషాలను ఆ జట్టు పంచుకుంది. అతడి గురించి చాలా మందికి తెలియని పలు రికార్డులను తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
- విదర్భ ప్రాంతం నుంచి వచ్చి టీమ్‌ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడిన తొలి ఆటగాడు ఉమేశ్
- స్వదేశంలో ఒక టెస్టులో పది వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.
- 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత అతడిది. 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగాడు. ఆ టోర్నీలో మూడో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
- గతేడాది దక్షిణాఫ్రికాపై ఒక టెస్టులో 10 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఫలితంగా 15 ఏళ్ల పాటు న్యూజిలాండ్ మాజీ బౌలర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఆడి 310 స్ట్రైక్‌రేట్ కలిగి ఉండటం ఈ రికార్డు ప్రత్యేకత.
- అలాగే 2018 ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధికంగా 13 వికెట్లు తీసిన ఘనత అతడి సొంతం.
- ఇక కెరీర్ మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 875 వికెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు, లిస్ట్ ఏ, ఫ్టస్‌క్లాస్ మ్యాచ్‌లన్నీ కలిపి..) తీశాడు