ETV Bharat / sports

స్మిత్​కు​ మరోసారి కెప్టెన్సీ అప్పగిస్తారా?

కెప్టెన్సీ పగ్గాలు తనకు అప్పగించే విషయమై చర్చలు సాగుతున్నాయని తెలిపాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్మిత్​. జట్టు మంచి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

Smith
స్మిత్​
author img

By

Published : Dec 10, 2020, 12:29 PM IST

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని స్టార్​ బ్యాట్స్​మన్​ స్మిత్ చెప్పాడు. ఏ స్థానంలోనైనా సరే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

"నాకు కెప్టెన్సీ ఇవ్వాలా వద్దా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇది జరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. కానీ అవేంటో నాకు తెలీదు. ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఆడుతున్న స్థానంతో సంతృప్తిగానే ఉన్నాను. ఎక్కడ బ్యాటింగ్​ చేయమన్నా చేస్తాను. ఇచ్చిన పని చేయడమే బ్యాట్స్​మెన్​ కర్తవ్యం"

-స్టీవ్ స్మిత్​, ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​

భవిష్యత్తులో ప్యాట్​కమిన్స్​ను వైస్​ కెప్టెన్​గా, కెప్టెన్లుగా మార్కస్​ లబుషేన్​, ట్రావిస్​ హెడ్​ ఉంటారని ఇటీవల క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది.

2018లో బాల్​ ట్యాంపరింగ్​కు పాల్పడిన స్మిత్​, వార్నర్​.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. దీంతో సారథి బాధ్యతలు నుంచి స్మిత్​, వైస్​ కెప్టెన్​ బాధ్యతల నుంచి వార్నర్​ను తప్పించారు.​

డిసెంబరు 17 నుంచి భారత్​తో జరిగే తొలి టెస్టుకు ఓపెనర్​ వార్నర్​ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో లబుషేన్, షాన్​ మార్ష్​, కామెరూన్​ గ్రీన్​ ఓపెనర్​గా వచ్చే అవకాశముంది. వీరిలో ఎవరిని ఎంచుకుంటారు అని స్మిత్​ను అడగ్గా.. "ఇది నా పని కాదు. సెలక్టర్లు నిర్ణయిస్తారు. ఈ ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. వారికి అవకాశమిస్తే బాగా ఆడుతారు అనడంలో సందేహం లేదు. అటు బ్యాటు, ఇటు బంతితో అదరగొడతారు" అని చెప్పాడు.

భారత్​ ఏ- ఆసీస్​ ఏ జట్ల మధ్య జరిగిన వార్మప్​ మ్యాచ్​లో కంకషన్​కు గురైన పుకోవిస్కీ గురించి స్మిత్​ మాట్లాడుతూ.. "నెట్​ ప్రాక్టీస్​లో ఏ స్థానంలో బ్యాట్స్​మన్​ నిలబడాలి, బంతులను ఎలా ఎదుర్కొవాలి లాంటి అంశాల గురించి తెలుసుకోవాలంటే మరింత బాగా శిక్షణ అవసరం. అప్పుడే ఇలాంటి సందర్భాల నుంచి తప్పించుకోవడానికి అవకాశముంటుంది" అని చెప్పాడు. తాను షార్ట్​పిచ్​ బంతులను చాలాసార్లు ఎదుర్కొన్నానని వెల్లడించాడు.

ఇదీ చూడండి : 'జట్టును కాపాడేందుకే స్మిత్​ అలా చేశాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.