ETV Bharat / sports

'అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పాలి?'

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమ్​ఇండియా జాబితాలో సూర్యకుమార్​ యాదవ్​కు అవకాశం కల్పించకపోవడంపై సీనియర్​ ఆటగాడు హర్భజన్​ సింగ్​ తీవ్రంగా మండిపడ్డాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ​ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్​ చేశాడు.

Harbhajan
హర్భజన్​ సింగ్
author img

By

Published : Oct 27, 2020, 8:51 PM IST

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై సీనియర్​ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడిని పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఖండించాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తీరును విమర్శిస్తూ ట్వీట్​ చేశాడు.

  • Don’t know what else @surya_14kumar needs to do get picked in the team india.. he has been performing every ipl and Ranji season..different people different rules I guess @BCCI I request all the selectors to see his records

    — Harbhajan Turbanator (@harbhajan_singh) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సూర్యకుమార్‌ ఇంకేమి నిరూపించుకోవాలో తెలియడం లేదు. అతడికి టీమ్​ఇండియాలో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రతి ఐపీఎల్, రంజీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంబిస్తున్నారు. ఇందుకు ఇదే నిదర్శనం. సెలక్టర్లు.. కనీసం అతని రికార్డులను ఓ సారి పరిశీలించాలని నా విజ్ఞప్తి."

-హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​

ఆస్ట్రేలియా వెళ్లే టెస్టు, వన్డే, టీ20 జట్టులను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. సూర్యకుమార్​ యాదవ్​తో పాటు రోహిత్‌ శర్మ, ఇషాంత్​ శర్మకు చోటు దక్కలేదు.

ఇది చూడండి 'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.