ETV Bharat / sports

కోహ్లీ ముందే ఔట్ అయ్యాడు.. కానీ? - kohli news

ఆసీస్​తో తొలి టెస్టులో 74 పరుగులు చేసి కోహ్లీ ఔటయ్యాడు. అంతకుముందు ఆసీస్ కెప్టెన్ వల్ల అతడికి జీవదానం లభించింది. ఇంతకీ ఏం జరిగింది?

Virat Kohli
విరాట్ కోహ్లీ
author img

By

Published : Dec 17, 2020, 9:19 PM IST

Updated : Dec 17, 2020, 9:45 PM IST

టీమ్​ఇండియా​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో త్వరగానే ఔటవ్వాలి. కానీ ఆసీస్ సారథి టిమ్ పైన్ డీఆర్​ఎస్​కు వెళ్లకపోవడం వల్ల తప్పించుకున్నాడు.

అసలేం జరిగింది?

రెండో సెషన్​లో కోహ్లీ బ్యాటింగ్.. లైయన్ బౌలింగ్. నడుము ఎత్తులో వచ్చిన ఓ బంతి కోహ్లీ​ గ్లౌజ్​ను తాకుతూ వెళ్లింది. స్టంప్స్ వెనుకున్న వికెట్ కీపర్ పైన్ దాన్ని క్యాచ్ పట్టాడు.

బౌలర్ లైయన్​తో పాటు మిగతా ఆసీస్​ ఆటగాళ్లు​ అప్పీల్​ చేసినా సరే పైన్ రివ్యూ తీసుకోవడానికి​ నిరాకరించాడు. దీంతో విరాట్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే 74 పరుగులు చేసిన కోహ్లీ.. సమన్వయ లోపం వల్ల రనౌట్​ అయ్యాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి 233/6తో నిలిచింది. క్రీజులో సాహా, అశ్విన్ ఉన్నారు.

Last Updated : Dec 17, 2020, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.