ETV Bharat / sports

ధోనీ, రోహిత్ కెప్టెన్సీలో తేడా అదే: భజ్జీ - ధోనీ తాజా వార్తలు

టీమ్​ఇండియా క్రికెటర్లు ధోనీ, రోహిత్ కెప్టెన్సీల గురించి మాట్లాడాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. వీరిద్దరి సారథ్యంలో బౌలర్లకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు.

భజ్జీ
భజ్జీ
author img

By

Published : May 29, 2020, 9:30 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్లు. చెన్నై సూపర్ కింగ్స్​కు ధోనీ మూడు టైటిల్స్ అందించగా.. ముంబయి ఇండియన్స్​ను నాలుగు సార్లు విజేతగా నిలిపాడు రోహిత్. అయితే ఈ ఇద్దరి కెప్టెన్సీలు వేరువేరుగా ఉంటాయి. తాజాగా మైదానంలో వీరి ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్.

"ధోనీ అందరిలాంటి కెప్టెన్‌ కాదు. ఇది చెయ్‌, అది చెయ్‌ అని ఆటగాళ్లకు చెప్పాడు. నువ్వేం చేయగలవో అది మాత్రమే చేయమని కోరుకునే సారథి. వికెట్ల వెనుక ఉండే ధోనీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడాలనుకుంటున్నారో గ్రహించి ఆ సమాచారాన్ని అందిస్తాడు, తర్వాత బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేయాలనుకుంటే.. అది నీపైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి పుణెలో శార్దూల్‌ ఠాకుర్‌ బాగా పరుగులిస్తున్నాడు. నేను ధోనీ వద్దకెళ్లి.. శార్దూల్‌ను యాంగిల్‌ మార్చమని ఎందుకు చెప్పవని అడిగా. అప్పుడు ధోనీ ఇలా అన్నాడు. 'భజ్జూ పా.. ఇప్పుడు నేనేమైనా చెబితే శార్దూల్‌ తికమకపడతాడు. అతడెలా వేయాలనుకుంటే అలానే కానీయ్‌. పరుగులు సమర్పించకున్నా పర్లేదు' అని చెప్పాడు"

-హర్భజన్, వెటరన్ క్రికెటర్

ధోనీ కెప్టెన్సీలో భారత జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్​కూ ఆడాడు భజ్జీ. రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్​ సభ్యుడిగానూ ఉన్నాడు. తాజాగా రోహిత్ సారథ్యం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

"రోహిత్ కూడా బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. కానీ ప్రతిసారి వికెట్లను కోరుకుంటాడు. బౌలింగ్​ విషయంలో కలగజేసుకోడు. బౌలర్​కు అటాకింగ్ ఫీల్డింగ్ అవసరమైతే దాన్ని అమలు చేస్తాడు. లెఫ్ట్​ హ్యాండ్ బ్యాట్స్​మెన్ వచ్చినపుడు మాత్రం బంతి స్పిన్ అయినా కాకపోయినా కచ్చితంగా స్లిప్​లో ఫీల్డింగ్ పెడతాడు."

-హర్భజన్, వెటరన్ క్రికెటర్

ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తో మళ్లీ క్రికెట్‌లో అడుగుపెడతాడని భావించినా కరోనా వైరస్‌తో టోర్నీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు గుప్పుమంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.