ETV Bharat / sports

'టీమ్​ఇండియాకు ధోనీ సేవలు ఇంకా అవసరం' - టీమిండియుకు ధోని అందించాల్సిందని చాలా ఉంది

భారత జట్టుకు ధోనీ సేవలు ఇంకా అవసరమని చెప్పిన మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్​ఇండియా విజేతగా నిలిచి ఏడేళ్లయిన సందర్భంగా ట్వీట్ చేశాడు.

dhoni
ధోని
author img

By

Published : Jun 24, 2020, 11:29 AM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ప్రతిభను గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​. అతడి సేవలు జట్టుకు ఇంకా అవసరమని అభిప్రాయపడ్డాడు. తద్వారా కోహ్లీసేన మరిన్ని విజయాలను అందుకుంటుందని అన్నాడు. ఏడేళ్ల క్రితం ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్​ ట్రోఫీ గెల్చుకుంది. ఈ నేపథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన భారత తొలి కెప్టెన్​గా అతడు ఘనత సాధించాడు. ఈ విషయమై ట్వీట్ చేసిన కైఫ్.. పైవిధంగా రాసుకొచ్చాడు.

  • On this day, 7 years back, MS Dhoni became the first captain to win all three ICC Trophies—Champions Trophy (2013),World Cup(2011) & WT20 (2007).Fine captain & a champion player. One of India's greatest match-winners. I feel he still has a lot to offer to Indian cricket @msdhoni pic.twitter.com/gVkp4MZuBL

    — Mohammad Kaif (@MohammadKaif) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సరిగ్గా ఏడేళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది భారత్. తద్వారా మూడు ఐసీసీ ట్రోఫీలు ఛాంపియన్​ ట్రోఫీ(2013), వరల్డ్​ టీ20కప్​(2011), డబ్లుటీ 20(2007) ముద్దాడిన ఏకైక కెప్టెన్ ధోనీనే. టీమ్​ఇండియాకు ఇలాంటి విజయాలను అతడు అందించాల్సిన అవసరం ఇంకా ఉంది"

-మహ్మద్​ కైఫ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్​ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. అయితే దీనిని సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇది చూడండి : టీమ్​ఇండియా క్రికెటర్లు అమ్మాయిలైతే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.