ఎంఎస్ ధోనీ భవితవ్యం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ ఆటగాడు మాత్రం కూతురు జీవాతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమె ప్రేమను ఆస్వాదిస్తున్నాడు. పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయాడు.
మిస్టర్ కూల్ ధోనీ గారాలపట్టి జీవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో ఎందరో అభిమానులను సంపాదించింది. తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఇందులో ధోనీ హాయిగా సేదతీరుతున్నాడు. వెనకాల సోఫాలో కూర్చున్న జీవా ధోనీ భుజాలను నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉంది. వీడియో పోస్ట్ చేసిన కాసేపట్లోనే 4 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అప్పుడప్పుడు మహీ తన కూతురు చేసే అల్లరి చేష్టల గురించి పోస్ట్ చేస్తుంటాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : బుల్లెట్‌పై ఒక్కడు.. సరిలేరు నీకెవ్వరు