ETV Bharat / sports

'ధోనీకి మనం చెప్పాల్సింది ఏమీ ఉండదు' - ఇమ్రాన్ తాహిర్ ధోనీ

టీమ్ఇండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ తాహిర్. ఐపీఎల్​లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్​కు ఆడుతున్న తాహిర్ అతడు గొప్ప వ్యక్తని వెల్లడించాడు.

Dhoni
ధోనీ
author img

By

Published : Feb 1, 2021, 6:58 AM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అన్నాడు. ధోనీ సారథ్యంలో ఆడేందుకు తాను ఇష్టపడతానని చెప్పాడు. చెన్నై కెప్టెన్‌ అమోఘమైన వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తాడు.

"ధోనీతో ఆడటం నా అదృష్టం. అతడితో కలిసి మూడేళ్లుగా ఆడుతున్నా. గొప్ప మనసున్న వ్యక్తి. ప్రతి ఒక్కర్నీ అర్థం చేసుకుంటాడు. అందర్నీ గౌరవిస్తాడు. అందుకే, ధోనీ అంటే అందరికీ అమితమైన ఇష్టం. ఆటపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి. అతడికి మనం చెప్పాల్సింది ఏమీ ఉండదు. బౌలర్లకు అనుకూలంగా ఫీల్డింగ్‌ ఎలా సెట్‌ చేయాలనే విషయం ధోనీకి తెలుసు. అతడితో ఉంటే చాలా నేర్చుకోవచ్చు. మరింత కాలం చెన్నైకి ఆడాలని కోరుకుంటున్నా."

-తాహిర్, దక్షిణాఫ్రికా క్రికెటర్

మూడేళ్లుగా చెన్నై తరఫున ఆడుతున్న తాహిర్ ఐపీఎల్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 80 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2019 సీజన్‌లో చెన్నై తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు తీసుకొన్నాడు. అయితే, యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఆడి ఒక వికెట్‌ తీశాడు. మరి రాబోయే సీజన్‌లో ఈ స్పిన్‌ బౌలర్‌ ఏ మేరకు మాయ చేస్తాడో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.