ETV Bharat / sports

'నేను చూశా.. ధోనీలో జోరు ఏమాత్రం తగ్గలేదు'

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ ఫుల్​ఫామ్​లో ఉన్నాడని, జోరు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాడు సీనియర్ స్పిన్నర్​ పీయూష్​ చావ్లా. మార్చిలో జరిగిన సీఎస్​కే శిక్షణ శిబిరంలో మహీ బ్యాటింగ్​, వికెట్​ కీపింగ్​ అద్భుతంగా చేశాడని పేర్కొన్నాడు.

dhoni
ధోనీ
author img

By

Published : Jul 3, 2020, 5:42 AM IST

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఒకవేళ మహీ మళ్లీ ఆడితే మునుపటిలా జోరు చూపగలడా? బ్యాటింగ్‌తో అలరిస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన స్పిన్నర్ పీయూష్​ చావ్లా​.. ధోనీ సామర్థ్యంపై అనుమానపడాల్సిన అవసరమే లేదన్నాడు. ఫుల్​ ఫామ్​లో ఉన్నాడని చెప్పాడు. కామెంటేటర్ ఆకాశ్​ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించాడు.

"సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్రికెటర్, తిరిగి మైదానంలో అడుగుపెడితే మునపటిలాగా ఆడగలడా? అనే అనుమానం సగటు వీక్షకుడిలో ఉంటుంది. కానీ ధోనీ మీద మాత్రం అలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహీ మ్యాచ్​లో ఆడేటప్పుడు ఎలాంటి తీవ్రత కనబరుస్తాడో.. ఇటీవలే మార్చిలో జరిగిన సీఎస్​కే శిక్షణ శిబిరంలోనూ బ్యాటింగ్​, వికెట్​ కీపింగ్​ ప్రాక్టీసు చేస్తున్నప్పుడు అలానే కనిపించాడు. క్యాంపులోని సురేశ్​ రైనా, అంబటి రాయుడు, ధోనీ, మురళీ విజయ్​తో పాటు పలువురు ఆటగాళ్లకు దాదాపు 2 నుంచి 2.30 గంటల సేపు నిరంతరాయంగా బ్యాటింగ్​ చేయగలిగే సత్తా ఉంది. దాదాపు 200 నుంచి 250 బంతులు ఆడగలరు"

-పీయీష్​ చావ్లా, టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్

dhoni
ప్రాక్టీసులో చెన్నై సూపర్​కింగ్స్ క్రికెటర్లు(పాత చిత్రం)

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో సెమీస్​లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో పంత్​, కేఎల్​ రాహుల్​ టీమ్​ఇండియా వికెట్​కీపర్​గా​ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.

అయితే ఐపీఎల్​లో ఆడి, టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. కానీ కరోనా ప్రభావంతో ప్రపంచకప్​ వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మహీ అంతర్జాతీయ కెరీర్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

dhoni
ధోనీ

ఇది చూడండి : ఒక్క సెంచరీతో రోహిత్ రెండు ప్రపంచ రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.