టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఆన్‌ఫీల్డ్, ఆఫ్‌ఫీల్డ్‌లో తనదైన ముద్ర వేస్తుంటాడు. ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు గబ్బర్. ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తాజాగా తన తనయుడు జొరావర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దీనికి "భార్యను ఒప్పించడానికి కొడుకు మద్దతు తీసుకోవాల్సి వస్తుంది" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే దీనికి ఫన్నీగా కామెంట్ పెట్టాడు యుజ్వేంద్ర చాహల్. "ఒకవేళ వదిన కానీ డ్యాన్స్ చేస్తే జొరావర్ నిన్ను విడిచిపెట్టి ఆమె వైపే ఉంటాడు" అని కౌంటర్ ఇచ్చాడు చాహల్. దీనికి నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.