గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో ఆడేందుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫిట్‌గా ఉన్నాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. నెట్ ప్రాక్టీస్‌లో వార్నర్ మోకాలికి గాయమైన కారణంగా ఆడతాడో లేదో అని అనుమానాలు వచ్చాయి.
"వార్నర్ ఆరోగ్యంగా ఉన్నాడు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు. మంగళవారం కొంచెం నీరసంగా ఉన్నట్లు కనిపించాడు. కానీ మ్యాచ్ ఆడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు" -జస్టిన్ లాంగర్, ఆసీస్ ప్రధాన కోచ్
గత ఏడాది బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, స్మిత్ ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్లీ యాషెస్ సిరీస్‌లోనే 5 రోజుల ఫార్మాట్లో ఆడనున్నారు.
ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఐదు టెస్టులు ఆడనుంది ఆస్ట్రేలియా. బర్మింగ్‌హామ్‌లో గురువారం ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది.
ఇది చదవండి: ఎలైట్ ప్యానల్లో భారత్ అంపైర్‌కు దక్కని చోటు