ETV Bharat / sports

సెహ్వాగ్​, రోహిత్​ రికార్డులు బ్రేక్​.. 19 ఏళ్ల దేవదత్​ ఘనత - సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ 2019

దేవదత్​ పడిక్కల్​.. కేరళకు చెందిన ఈ యువ క్రికెటర్​ జాతీయ టీ20 టోర్నీలో దుమ్ములేపుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీలో కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగిన ఇతడు.. తాజాగా ఓ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 60 బంతుల్లోనే 122 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు.

సెహ్వాగ్​, రోహిత్​ రికార్డులు బ్రేక్​... 19 ఏళ్ల దేవదత్​ ఘనత
author img

By

Published : Nov 12, 2019, 9:07 PM IST

సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీలో పరుగల ప్రవాహం కొనసాగిస్తున్నాడు కర్ణాటక జట్టు ఆటగాడు దేవదత్​ పడిక్కల్​. ఇటీవల జరిగిన కర్ణాటక ప్రీమియర్​ లీగ్​(కేపీఎల్​), విజయ్​ హాజారే ట్రోఫీలోనూ అత్యధిక పరుగుల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు.

కేపీఎల్​లో 8 ఇన్నింగ్స్​ల్లో 310 పరుగులు చేసిన దేవదత్​.. నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత విజయ్​ హాజారే ట్రోఫీలోనూ 11 ఇన్నింగ్స్​ల్లో 609 రన్స్​ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. ఆ జట్టు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడీ యువ క్రికెటర్​.

Devdutt Padikkal scores most runs in Syed Mushtaq Ali T20 Trophy, future hope for team india
దేవదత్​ పడిక్కల్

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా.. సోమవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో కన్నడ జట్టు తరఫున సెంచరీతో ఆకట్టుకున్నాడు దేవదత్​. పిన్న వయసులోనే ఈ టోర్నీలో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తంగా ఈ మ్యచ్​లో 122 రన్స్ (60 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు)​తో నాటౌట్​గా నిలిచాడు.

హిట్​మ్యాన్​ను దాటేశాడు​...

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడిగా(19 ఏళ్ల 127 రోజులు) అరుదైన ఘనత సాధించాడు దేవదత్​. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న రోహత్​శర్మ(19 ఏళ్ల 339 రోజులు)ను నాలుగో స్థానానికి నెట్టాడు. 18 ఏళ్ల విజయ్ జోల్ 2013లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 109 పరుగులు చేశాడు. అదే ఇప్పటికీ టాప్​-1 రికార్డుగా ఉంది.

సెహ్వాగ్​ రికార్డు బ్రేక్​...

ఈ మ్యాచ్‌లో దేవదత్​ పడిక్కల్​(122 నాటౌట్) సాధించి... ఈ జాతీయ టీ20 ట్రోఫీ చరిత్రలో చేధనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 2011 ఐపీఎల్​లో సెహ్వాగ్​ చేసిన 119 పరుగుల రికార్డు బ్రేక్​ అయింది. 2017-18 ఎడిషన్‌లో దిల్లీ ఆటగాడు రిషభ్ పంత్(116) హిమాచల్ ప్రదేశ్‌పై నెలకొల్పిన రికార్డునూ తిరగరాశాడు.

టీ20 చేధనలో ఓ కర్ణాటక బ్యాట్స్‌మన్ నెలకొల్పిన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున పాల్ వాల్తాటి(120 నాటౌట్) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

RESTRICTION SUMMARY: NO ACCESS MOLDOVA
SHOTLIST:
PROTV MOLDOVA - NO ACCESS MOLDOVA
Chisinau - 12 November 2019
1. Pan of protest in support of Moldovan government
2. Various of Moldovan MPs raising their hands during vote of confidence in parliament
3. SOUNDBITE (Romanian) Maia Sandu, Prime Minister of Moldova:
"We refuse to take part in a game in which we try to establish clear and predictable rules and our coalition partners use them to capture a state institution. It is clear today that the fight is between the ones who want to control the justice and the prosecutors office, to get rich and to keep Moldova under poverty and the ones who fight for the institutions, for independent and correct justice that would be the basis for economic growth and investment and the creation of a free and prosperous society."
4. Protesters gathered outside parliament, chanting
5. SOUNDBITE (Romanian) Name not given, protester:
"We're here to support Maia Sandu and to cancel the vote of confidence so that Prime Minister Sandu can go forward with the reforms. We the people voted for the reforms and they must listen to the voice of the people."
6. Protesters
7. SOUNDBITE (Romanian) Name not given, protester:
"For 30 years all the governments did nothing. So the President must not sell our country and us to become slaves."
8. Various of protest, protesters chanting
STORYLINE:
Moldova's government coalition between a pro-European group and a Russian-backed party has fallen after losing a no-confidence vote in parliament.
Prime Minister Maia Sandu's government lost Tuesday's vote as 63 of 101 lawmakers supported the no-confidence motion.
Relations between Sandu's ACUM group and the Socialists deteriorated over her plan to take control of the process to nominate the country's prosecutor general, which Sandu presented as a key issue in her anti-corruption efforts.
Sandu took office in June after uncertainty due to legal challenges questioning her government's legitimacy.
One of the poorest countries in Europe, Moldova is plagued by corruption and political turmoil. The country has been an arena of rivalry between the West and Russia since it won independence after the 1991 collapse of the Soviet Union.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.