టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో కొంచెం దూకుడుగా కనిపిస్తాడనేది అందరికి తెలిసిందే. తన ఉత్సాహంతో అప్పుడు అప్పుడు క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడీ ఆటగాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ బ్యూరో హెండ్రిక్స్ ఓవర్లో పరుగుకు ప్రయత్నించిన విరాట్ అతడిని నెట్టుకుంటూ వెళ్లాడు. నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఐసీసీ .. కోహ్లీకి ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
ఇప్పటికే రెండుసార్లు క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడిన కోహ్లీ తాజాగా మూడో పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంకొక్క పాయింట్ చేరితే అతడిపై వేటు పడే అవకాశముంది. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఒకటి, ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంలో రెండో డీమెరిట్ పాయింట్ విరాట్ ఖాతాలో చేరాయి.
24 నెలల సమయంలో ఓ ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే అతడిపై ఓ టెస్టు లేదా, 2 వన్డేలు లేదా 2 టీ-20 (వీటిలో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్) నిషేధం ఎదుర్కొంటాడు.