ETV Bharat / sports

హజారే ట్రోఫీ: క్వార్టర్స్​లోకి దూసుకెళ్లిన దిల్లీ - హజారే ట్రోఫీ

విజయ్​ హజారే టోర్నీ క్వార్టర్​ ఫైనల్స్​లోకి దిల్లీ అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్​లో ఉత్తరాఖండ్​పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Delhi enters Vijay Hazare tourney quarterfinals
హజారే ట్రోఫీ: క్వార్టర్స్​లోకి దూసుకెళ్లిన దిల్లీ
author img

By

Published : Mar 8, 2021, 7:29 AM IST

Updated : Mar 8, 2021, 8:59 AM IST

వికెట్​ కీపర్​ అనూజ్​ రావత్​ (95 నాటౌట్​; 85 బంతుల్లో 7x4, 6x6), కెప్టెన్ ప్రదీప్​ సాంగ్వాన్​ (58 నాటౌట్​; 49 బంతుల్లో 6x4, 2x6) చెలరేగడం వల్ల విజయ్​ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్​ టోర్నీలో దిల్లీ క్వార్టర్​ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్​లో దిల్లీ 4 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్​పై నెగ్గింది.

మొదట బ్యాటింగ్​ చేసిన ఉత్తరాఖండ్​ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు సాధించింది. కమల్​సింగ్​ (77), కునాల్​ చండేలా (62) మెరిశారు. అనంతరం దిల్లీ 48.3 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఒక దశలో 146/6తో ఓటమి అంచుల్లో ఉన్న దిల్లీకి అనూజ్​, ప్రదీప్​లు 143 పరుగుల అజేయ భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు. నితీశ్​ రాణా(81) రాణించాడు.

ఇదీ చదవండి: షాహిద్​ అఫ్రిదికి అల్లుడవుతున్న పాక్​ యువ బౌలర్​

Last Updated : Mar 8, 2021, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.