ETV Bharat / sports

ఐపీఎల్​: దిల్లీ క్యాపిటల్స్​ ఫిజియోకు కరోనా

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)ను కరోనా భయం వెంటాడుతోంది. తొలుత చెన్నై సూపర్​కింగ్స్​లో క్రికెటర్లతో పాటు సిబ్బందికి కరోనా సోకగా.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్​లోనూ కొవిడ్​ కేసు నిర్ధరణ అయింది.

Delhi Capitals's assistant physio tests COVID-19 positive
దిల్లీ క్యాపిటల్స్​ శిబిరంలో ఫిజియోకు కరోనా
author img

By

Published : Sep 7, 2020, 9:45 AM IST

దిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కరోనా కేసు నిర్ధరణ అయింది. జట్టు ఫిజియోథెరపిస్ట్​ సహాయకులలో ఒకరికి కొవిడ్​ సోకినట్లు మూడోసారి చేసిన పరీక్షల్లో తేలింది. యూఏఈకి చేరుకున్న తర్వాత ఇప్పటివరకు మూడు పరీక్షలు జరిపామని తొలి రెండింట్లో నెగెటివ్​ వచ్చినా సరే, మూడోసారి చేసిన పరీక్షల్లో అతడికి పాజిటివ్​గా వచ్చినట్లు దిల్లీ ఫ్రాంఛైజీ వెల్లడించింది.

"అతడు ఇంకా జట్టుతో కలవలేదు. ఫ్రాంఛైజీకి సంబంధించిన ఏ ఆటగాడు లేదా సిబ్బందితో సన్నిహితంగా లేడు. అతడు దుబాయ్​లోని ఐపీఎల్​ ఐసోలేషన్​ కేంద్రంలో 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంటాడు. మా వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" -దిల్లీ క్యాపిటల్స్​ ప్రకటన

ఐపీఎల్​లో కరోనా కేసు వచ్చిన మూడో జట్టుగా దిల్లీ క్యాపిటల్స్​ నిలిచింది. అంతకు ముందు చెన్నై సూపర్​కింగ్స్​లోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మంది సిబ్బందికి పాజిటివ్​గా తేలింది. యూఏఈ ప్రయాణానికి ముందే రాజస్థాన్​ రాయల్స్​ ఫీల్డింగ్​ కోచ్​ దిశాంత్​​కు వైరస్​ సోకింది. 14 రోజుల ఐసోలేషన్​ తర్వాత తిరిగి ఆతిథ్య దేశం వెళ్లేందుకు అనుమతి పొందాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.