వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి గడువు ముగిసింది. పలు ఫ్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్నాయి. ట్రేడింగ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్‌లను సొంతం చేసుకుంది. ఈ కారణంగా కెప్టెన్సీపై పలు వార్తలు వచ్చాయి. రహానే, అశ్విన్లలో ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పుతారన్న పుకార్లు వినిపించాయి. వీటన్నింటిపై దిల్లీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది.
దిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని పోస్టు చేస్తూ " మా కెప్టెన్ ఫెంటాస్టిక్, వచ్చే సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. అనుభవజ్ఞులైన సూపర్ స్టార్లను జట్టులో చేర్చాం. అలాగే త్వరలో వేలం జరగబోతుంది కాబట్టి.. మన కెప్టెన్ అద్భుతమైన జట్టుని అన్ని విధాలా నడిపించగలడా?" అంటూ చెప్పుకొచ్చింది.
-
Our Captain Fantastic, @ShreyasIyer15 sure is excited to hit the ground running in #IPL2020 🤩
— Delhi Capitals (@DelhiCapitals) November 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
With experienced superstars added to the squad and the auction still to come, can our skipper lead a formidable team all the way? 💪🏻#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/8yvBBIg0gP
">Our Captain Fantastic, @ShreyasIyer15 sure is excited to hit the ground running in #IPL2020 🤩
— Delhi Capitals (@DelhiCapitals) November 18, 2019
With experienced superstars added to the squad and the auction still to come, can our skipper lead a formidable team all the way? 💪🏻#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/8yvBBIg0gPOur Captain Fantastic, @ShreyasIyer15 sure is excited to hit the ground running in #IPL2020 🤩
— Delhi Capitals (@DelhiCapitals) November 18, 2019
With experienced superstars added to the squad and the auction still to come, can our skipper lead a formidable team all the way? 💪🏻#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/8yvBBIg0gP
ఆ వీడియోలో అశ్విన్, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుతో చేరడాన్ని సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్, వేలం కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని.. వచ్చే సీజన్‌లో తన కెప్టెన్సీలో దిల్లీ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టైటిల్ ముంగిట బోల్తా పడింది.
ఇవీ చూడండి..'కోహ్లీ, డివిలియర్స్ ఆడితేనే మ్యాచ్లు గెలవలేం'