బెంగళూరు ఖాతాలో మరో ఓటమి నమోదైంది. దిల్లీ చేతిలో మ్యాచ్‌ను చేజార్చుకుని 12వ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దిల్లీ మరో 4 వికెట్లుండగానే గెలుపొందింది.
ఆడుతూ పాడుతూ ఛేదన
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే ధావన్ వికెట్ కోల్పోయింది. అనంతరం పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. పృథ్వీషా 28 పరుగులు చేసి ఔటైనా... కెప్టెన్ అయ్యర్ 67 (8 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత అర్ధశతకంతో జట్టుకు విజయాన్నందించాడు.
తడబడిన ఛాలెంజర్స్
మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు ప్రారంభంలోనే పార్థివ్ పటేల్ (9) వికెట్ కోల్పోయింది. డివిలియర్స్ (17), స్టాయినిస్ (15) కూడా విఫలమయ్యారు. మొయిన్ అలీ 18 బంతుల్లో 32 పరుగులతో మెరిశాడు. కోహ్లీ 33 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు.
దిల్లీ బౌలింగ్ భళా
దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. రబాడ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. క్రిస్ మోరిస్ రెండు, అక్షర్ పటేల్, లామిచానే చెరో వికెట్ తీశారు.
-
Played, Skip 🙌 pic.twitter.com/35mOEsLoxr
— IndianPremierLeague (@IPL) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Played, Skip 🙌 pic.twitter.com/35mOEsLoxr
— IndianPremierLeague (@IPL) April 7, 2019Played, Skip 🙌 pic.twitter.com/35mOEsLoxr
— IndianPremierLeague (@IPL) April 7, 2019
బెంగళూరు బౌలర్లలో సైనీ రెండు వికెట్లు తీయగా సౌథి, నేగి, సిరాజ్, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.