ETV Bharat / sports

'పాక్​తో సిరీస్​ అనంతరం కెప్టెన్​ మార్పు'

పాకిస్థాన్​తో టెస్టు సిరీస్​ అనంతరం కెప్టెన్సీ మార్పు ఉంటుందని దక్షిణాఫ్రికా కోచ్​ మార్క్​ బౌచర్​ తెలిపాడు. ఈ అదనపు బాధ్యతలతో డికాక్​ బ్యాటింగ్​పై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. త్వరలోనే మరో వ్యక్తిని కెప్టెన్​గా నియమిస్తామని స్పష్టం చేశాడు.

De Kock to no longer remain Test captain after Pak series, confirms Boucher
'పాకిస్థాన్​తో సిరీస్​ అనంతరం కెప్టెన్సీ మార్పు'
author img

By

Published : Feb 4, 2021, 10:24 AM IST

ప్రస్తుతం పాకిస్థాన్​లో జరుగుతున్న సిరీస్​ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి క్వింటాన్​ డికాక్​ను తప్పిస్తామని దక్షిణాఫ్రికా జట్టు కోచ్​ మార్క్​ బౌచర్​ స్పష్టం చేశాడు. ఈ అదనపు బాధ్యత అతని బ్యాటింగ్​పై ప్రభావం చూపిస్తుందని మార్క్​ పేర్కొన్నాడు. తమతో టెస్టు సిరీస్​ను క్రికెట్​ ఆస్ట్రేలియా వాయిదా వేయడం నిరాశ కలిగించిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆస్ట్రేలియా తమ పర్యటనను వాయిదా వేసుకుంది. దీంతో వచ్చే తొమ్మిది నెలల్లో మాకు టెస్టు సిరీస్​లు లేవు. పాకిస్థాన్​​ నుంచి స్వదేశానికి తిరిగి రాగానే మాకు కొంచెం సమయం ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుంటాం. టెస్టు కెప్టెన్​గా ఎవరు సమర్థుడనే విషయాన్ని తేలుస్తాం. ఫలితంగా డికాక్​పై ఉన్న అదనపు బాధ్యతలు తొలగిస్తాం.

-మార్క్​ బౌచర్​, దక్షిణాఫ్రికా కోచ్​.

2020 వేసవిలో క్విన్నీని తాత్కాలిక టెస్టు కెప్టెన్​గా నియమించారు.

"అది అతనిపై అదనపు భారం అవుతుంది. ప్రస్తుత పాకిస్థాన్​ సిరీస్​లో అతడు ఫామ్​ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 15, 2 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోతే అందరి దృష్టిలో పడతాం. కెప్టెన్​గా ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంటుంది" అని బౌచర్​ తెలిపాడు.

ఆసీస్​ నిర్ణయంపై అసంతృప్తి..

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​ను ఆస్ట్రేలియా వాయిదా నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు తప్పుపడుతున్నారు. దీనిపై బౌచర్​ స్పందించాడు. ఇది తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని.. ఆర్థికంగానూ అధిక నష్టం వాటిల్లుతుందని తెలిపాడు.

ఈ సిరీస్​కు ముందు మేము శ్రీలంకలో పర్యటించాం. అక్కడ హోటల్​లోని​ బయో బబుల్​లో ఉండగా కరోనా కేసు వెలుగు చూసింది. అయినప్పటికీ మేము సిరీస్​ను కొనసాగించాం. ప్రస్తుతం పాకిస్థాన్​తో సిరీస్​ను ఆడుతూనే.. టీ20ల్లో లేని కొంత మంది ఆటగాళ్లను స్వదేశానికి పంపించాలనే ప్రణాళికలు వేసుకున్నాం. ఇవన్నీ ఆసీస్​తో జరుగనున్న సిరీస్​ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలే. ఈ విషయంపై బౌలింగ్​ కోచ్​ చార్ల్​ లాంగ్​వెల్ట్​, మీడియా మేనేజర్​ సిపోకజి సోకనైల్​తో చర్చించాను. కానీ ముందస్తు సమాచారం లేకుండా ఏకపక్షంగా ఆసీస్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

-మార్క్​ బౌచర్​, దక్షిణాఫ్రికా కోచ్​.

ఇదీ చదవండి: ఆసియా మిక్స్‌డ్‌ బ్యాడ్మింటన్‌ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.