దేశ రాజధాని దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. దిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ సేవలను వారు గుర్తు చేసుకున్నారు.
ప్రేక్షకులు కూర్చునే ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరును పెట్టారు. ఈ ఘనత సాధించిన యువ క్రికెటర్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. ఇంతకుముందు దిల్లీ క్రికెటర్లు మొహిందర్ అమర్నాథ్, బిషన్ సింగ్ బేడీలు ఈ ఘనత సాధించినా.. వారి రిటైర్మెంట్ తర్వాత ఇది సాధ్యమైంది.
ఇవీ చూడండి.. అవన్నీ పుకార్లే : ధోనీ భార్య సాక్షి సింగ్