పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (డేనైట్) ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(335*) ట్రిపుల్ శతకంతో అదరగొట్టాడు. ఈ విషయంపై స్పందించిన అతడి సతీమణి కాండిస్ వార్నర్ ట్విట్టర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. భారత జాతిపిత మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేసుకుంది.
"శారీరక సామర్థ్యంతో బలం చేకూరదు. దృఢ సంకల్పంతోనే అది సిద్ధిస్తుంది" అనే కోట్‌ను వార్నర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది కాండిస్. "నీ గురించి ఇతరులు ఏం నమ్ముతున్నారని కాదు, నీపై నువ్వు ఏ నమ్మకంతో ఉన్నావన్నదే ముఖ్యం" అని తెలిపింది.
-
Strength does not come from physical capacity. It comes from a indomitable will. (Mahatma Gandhi) It’s not important what other people believe about you. It’s only important what you believe about yourself. @davidwarner31 #335notout pic.twitter.com/Vlg9NVktj0
— Candice Warner (@CandyFalzon) November 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Strength does not come from physical capacity. It comes from a indomitable will. (Mahatma Gandhi) It’s not important what other people believe about you. It’s only important what you believe about yourself. @davidwarner31 #335notout pic.twitter.com/Vlg9NVktj0
— Candice Warner (@CandyFalzon) November 30, 2019Strength does not come from physical capacity. It comes from a indomitable will. (Mahatma Gandhi) It’s not important what other people believe about you. It’s only important what you believe about yourself. @davidwarner31 #335notout pic.twitter.com/Vlg9NVktj0
— Candice Warner (@CandyFalzon) November 30, 2019
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించే విషయంపై నాలుగేళ్ల క్రితం వార్నర్ ఓ జోక్ చేశాడు. జొనాథన్ ఖా అనే వ్యక్తి 2015లో ట్వీట్ చేస్తూ వార్నర్‌ను సుదీర్ఘ క్రికెట్‌లో త్రిశతకం బాదమని కోరాడు. అందుకు స్పందించిన ఆసీస్ ఓపెనర్.. నా సహనాన్ని చూశావా? హాహా! అంటూ నవ్వేశాడు. పాకిస్థాన్‌పై శనివారం ఆ ఘనత సాధించాక వార్నర్ చేసిన జోక్ ట్వీట్ తాజాగా వార్తల్లో నిలిచింది.
ఇవీ చూడండి.. పాక్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఐలాండ్ క్రికెట్ బోర్డు