టిక్‌టాక్‌లతో అదరగొడుతున్న వార్నర్.. మరోసారి ఆకట్టుకునే వీడియో చేశాడు. ఇందులో భాగంగా వైన్ గ్లాస్, వంట వస్తువులు ఉపయోగించి సంగీత సాధన చేస్తూ కనిపించాడు. దీనిని తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇంకేవైనా ఆలోచనలు ఉంటే తనకు చెప్పండని నెటిజన్లను కోరాడు.
లాక్‌డౌన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యాడు వార్నర్. ఈ సమయాన్ని కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే తన భార్య క్యాండీ, కూతుళ్లతోనూ టిక్‌టాక్ చేస్తూ అలరించాడు.
- View this post on Instagram
Back by popular demand!! Give me more options please😂😂 #foryou #isolation
">
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్నాడు వార్నర్. ఈ టోర్నీలో మొత్తంగా 126 మ్యాచ్‌లాడి 43.17 సగటుతో 4,706 పరుగులు చేశాడు.