కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. తనతో సహా ఆస్ట్రేలియా క్రికెటర్లంతా ఐపీఎల్లో ఆడతారని చెప్పాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టమని అన్నాడు. ఇటీవలే మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు.
![David Warner is very sure of playing IPL if T20 World Cup gets postponed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12c1d968f5087a830884cb2df8fb5742_2106newsroom_1592718009_266.jpg)
"ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం కాకపోతే మా వాళ్లంతా ఐపీఎల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా బోర్డు అనుమతి లభిస్తే, ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా, టోర్నీలో ఆడతారు. ప్రభుత్వం కూడా ప్రయాణానికి అనుమతలు ఇవ్వాలి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ వాయిదాపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పాల్గొనే ప్రతి ఒక్క దేశాన్నీ ఆస్ట్రేలియాకు తీసుకురావడమంటే సవాలుతో కూడుకున్న పని. దీనితోపాటే 14 రోజుల క్వారంటైన్ ఉంటుంది"
డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్
కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో.. ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వార్నర్ వెల్లడించాడు. ఈ సంవత్సరం చివర్లో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
కోహ్లీ గురించి చెప్పాలంటే
![David Warner is very sure of playing IPL if T20 World Cup gets postponed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/virat-kohli-fb-1_2106newsroom_1592718009_174.jpg)
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న స్నేహం గురించి చెప్పిన వార్నర్.. అతడొక అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించాడు.
"మైదానం బయట అతడితో ఎన్నో విషయాలు మాట్లాడుతూ. ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి మెసేజ్‌ల ద్వారా తెలుసుకున్నా. అతడు అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం మైదానంలో చాలా కష్టపడతాం. ఆటలో భాగంగా టీమ్ కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం"
-డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్
ఆ వీడియోలు ఎందుకు చేశానంటే
లాక్డౌన్ సమయంలో సతీమణి క్యాండీస్‌తో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించిన వార్నర్.. అవి చేయడానికి గల కారణాలను తెలిపాడు. కష్టకాలంలో ఉన్నవారి ముఖాలపై చిరునవ్వులు తెప్పించేందుకే ఆ వీడియోలు చేశానని అన్నాడు.
ఇదీ చూడండి:'భారత్‌తో సిరీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'