"కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు".. అనేది యంగ్రెబల్స్టార్ ప్రభాస్ డైలాగ్. "టిక్‌టాక్ వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు" అనేది డేవిడ్ వార్నర్ వెర్షన్. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో తనలా టిక్‌టాక్ వాడిన క్రికెటర్ మరొకరు ఉండకపోవచ్చు. ఇటీవలే 'పోకిరి', 'బాహుబలి' సినిమాల్లోని డైలాగ్‌లతో పాటు 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలకు కుటుంబసమేతంగా స్టెప్పులేసి అలరించాడు.
తాజాగా హిందీ 'ముక్కాలా ముక్కాబులా' పాటకు తన భార్యతో కలిసి చిందేశాడు వార్నర్. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ముక్కాబులా' సాంగ్‌కు వార్నర్, తన భార్య, హీరోయిన్ శిల్పాశెట్టిలలో ఎవరు బాగా స్టెప్పులేశారో తెలియజేయమని నెటిజన్లును కోరాడు. శిల్పాశెట్టి గతంలో 'ముక్కాబులా'పై టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేయగా.. ప్రభుదేవా అందులో ఆమె డాన్స్ చూస్తూ.. ఫ్రేమ్‌లో నుంచి వెళ్లిపోయాడు.
ఆ పాటకు చేయలేను ఎందుకంటే..
మహేశ్‌బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి 'మైండ్ బ్లాక్' పాటకు డాన్స్ వీడియో చేయమని పలువురు నెటిజన్లు కోరగా.. ఆ పాట వీడియో సాంగ్ ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చేస్తానని చెప్పాడు.
ఇదీ చూడండి.. రహానే, పంత్, శ్రేయస్‌లకు రోహిత్ సవాల్