ETV Bharat / sports

'అన్ని ఫార్మాట్లలో ఆసీస్​ కెప్టెన్​గా కమిన్సే సరైనోడు'​

ఆసీస్​ తదుపరి కెప్టెన్​గా పాట్​ కమిన్స్ అయితే సరైన వ్యక్తి అని తెలిపాడు మాజీ సారథి మైకేల్ క్లార్క్. జట్టులో ఉన్న సీనియర్ల నుంచి సహకారం అందితే టీమ్​ను సమర్థంగా నడిపించగలడని అభిప్రాయపడ్డాడు.

Cummins right man to lead Australia in all three formats, believes Clarke
ఆసీస్​ కెప్టెన్​గా కమిన్స్​ సరైన వ్యక్తి: క్లార్క్​
author img

By

Published : Mar 31, 2021, 4:04 PM IST

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీపై తాజాగా​ మాజీ సారథి మైకేల్ క్లార్క్ స్పందించాడు. పేసర్​ పాట్​ కమిన్స్​ జట్టును మూడు ఫార్మాట్లలో నడిపించగల సరైన వ్యక్తి అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై టీమ్ఇండియాతో సిరీస్​ కోల్పోయిన తర్వాత.. టెస్టు కెప్టెన్​గా టిమ్​ పైన్​ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్లార్క్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"తదుపరి కెప్టెన్​గా పాట్​ కమిన్స్ పేరును సూచిస్తాను. గత కొన్నేళ్లుగా అతడు మూడు ఫార్మాట్లలో స్థిరంగా రాణిస్తున్నాడు. సారథిగానూ అతడు సరైన వ్యక్తి. న్యూసౌత్​ వేల్స్​కు నాయకత్వం వహించినప్పుడు నేను చూశాను. వ్యూహత్మకంగా వ్యవహరిస్తాడు. అతడు చాలా మంచి వ్యక్తి."

-మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ కెప్టెన్.

"అవును కమిన్స్ యువకుడు. లీడర్​గా అనుభవం లేదు. కానీ, జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించగల సమర్థమైన వ్యక్తి కమిన్స్ అని నా వరకైతే నమ్ముతాను. అతడికి మంచి వైస్​ కెప్టెన్ కూడా కావాలి. స్మిత్, వార్నర్, లైయన్, స్టార్క్, హేజిల్​వుడ్, లబుషేన్ వంటి సీనియర్ ప్లేయర్లు అతడికి అండగా ఉంటారు." అని క్లార్క్​ అభిప్రాయపడ్డాడు. ​

ఇదీ చదవండి: 'స్మిత్​.. కెప్టెన్సీ స్థానం ఖాళీగా లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.