ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త జెర్సీని ప్రకటించింది. ముందు భాగంలో మూడు స్టార్లతో పాటు సాయుధ దళాల సేవలకు నివాళిగా జెర్సీని రూపొందించింది సీఎస్కే. 2010, 2011, 2018లలో మూడు సార్లు ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇందుకు గుర్తుగా ఈ మూడు స్టార్లను జెర్సీపై ఉంచింది చెన్నై. కొత్త జెర్సీకి సంబంధించిన ఓ చిన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది ఆ జట్టు ఫ్రాంచైజీ. ఇందులో జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించాడు.
-
Thala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🛒 - https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfL
">Thala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2021
🛒 - https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfLThala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2021
🛒 - https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfL
"సాయుధ దళాలకు సంబంధించి నిస్వార్థ పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నించాలనుకున్నాం. చివరికి ఈ విధంగా సాధ్యమైంది. వారు నిజమైన హీరోలు" అని జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ వెల్లడించాడు.
సీఎస్కే.. సాయుధ దళాలపై తమకున్న ప్రత్యేక ప్రేమను చాటుకుంది. 2019 ఐపీఎల్‌కు ముందు కూడా రూ.2 కోట్ల చెక్కును సాయుధ బలగాలకు అందించింది. జెర్సీ భుజ భాగంలో ఆర్మీ గోల్డ్ బ్యాండ్ కనిపించేలా తయారు చేశారు. ఇది సీఎస్కే నిలకడకు, ఫెయిర్ ప్లేకు నిదర్శనమని చెన్నై భావిస్తోంది. మొత్తం 11 సీజన్లలో చెన్నై 5 సార్లు ఫెయిర్ ప్లే అవార్డును కైవసం చేసుకుంది.
కాగా, ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కర్నల్‌గా వ్యవహరిస్తున్నాడు. 2019లో పారాచూట్ శిక్షణ కూడా తీసుకున్నాడు. నకలు జెర్సీ కావాల్సిన అభిమానులు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సీఎస్కే పేర్కొంది.
ఇదీ చదవండి: జకోవిచ్‌ను లొంగదీసుకుంటే డబ్బులిస్తామన్నారు!