ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అందులో భారత ఆటగాళ్లలో కెప్టెన్ ధోనీ తర్వాత ఉపసారథి సురేశ్ రైనా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఆటగాళ్లు. రైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా కొనసాగుతుండగా, రవీంద్ర జడేజా అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు అద్భుత విజయాలు అందించారు. అయితే, రైనా గతేడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌లో ఆడలేకపోయాడు.
ఇదీ చదవండి: మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత హుబెర్ట్
మరోవైపు జడేజా గత సీజన్లో బ్యాట్‌తో మెరిశాడు కానీ బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన అతడు.. మూడు నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ మధ్యే కోలుకుని ప్రస్తుత సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. సీఎస్కే శిబిరంలో వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్.. 8+3=11, వీరిద్దరూ చెన్నైని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారంటూ రాసుకొచ్చింది. రైనా ఆ జట్టులో మూడో స్థానంలో, జడేజా 8వ స్థానంలో బరిలోకి దిగుతారు. దీంతో వారిద్దరి బ్యాటింగ్ స్థానాల్ని కలిపి చెన్నై అలా ట్వీట్ చేసింది.
-
Chinna Thala.. Periya Manasu! 8 and 3 ready to take the 11 on the other side! #Yellove #WhistlePodu 💛🦁 @imjadeja @ImRaina pic.twitter.com/4OGnw7Z2XO
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chinna Thala.. Periya Manasu! 8 and 3 ready to take the 11 on the other side! #Yellove #WhistlePodu 💛🦁 @imjadeja @ImRaina pic.twitter.com/4OGnw7Z2XO
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2021Chinna Thala.. Periya Manasu! 8 and 3 ready to take the 11 on the other side! #Yellove #WhistlePodu 💛🦁 @imjadeja @ImRaina pic.twitter.com/4OGnw7Z2XO
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2021
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 15 మంది షూటర్లు
గతే ఐపీఎల్‌లో రైనా లేని లోటు చెన్నై జట్టులో చాలా స్పష్టంగా కనిపించింది. లీగ్ దశలో వరుస ఓటములతో ధోనీసేన తడబడింది. చివర్లో పలు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఇప్పుడు రైనా రాకతో చెన్నై, ఇంతకు ముందులా ప్రభావం చూపుతుందేమో చూడాలి. ఈసారి ఆ జట్టు తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఆదివారం ముంబయి వేదికగా వాంఖడేలో పోరు జరగనుంది.
ఇదీ చదవండి: బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌గా మాజీ డీజీపీ