ETV Bharat / sports

వార్నర్‌ దశావతారం.. రాహుల్​కు పీడకలలు ! - కుటంబంతో ధావన్​ లాక్​డౌన్​ ఎంజాయ్​

కరోనా వైరస్​..కోరుకోని అతిథి! ఆ మహమ్మారి దాదాపు అందరి జీవితాల్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అయితే ఎప్పుడూ ఆటతో బిజీబిజీగా ఉండే క్రికెటర్లకు ఆ సమయం మంచి విరామంగా కలిసొచ్చింది. ఈ విరామ సమయాన్ని మన అభిమాన క్రికెటర్లు ఎలా ఆస్వాదించారో చూద్దాం.

rahul
రాహుల్​
author img

By

Published : Dec 31, 2020, 2:22 PM IST

బహుశా లాక్‌డౌన్‌లో డేవిడ్ వార్నర్ కన్నా మరెవరు గొప్పగా ఎంజాయ్‌ చేసి ఉండరు! కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్ అయినప్పటికీ అతడికి తెలుగు అభిమానులు ఎక్కువ. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరఫున ఆడటమే దానికి కారణం. తన ఫ్యాన్స్‌కు తగ్గట్లుగా టాలీవుడ్‌లో హిట్ అయిన పాటలను టిక్‌టాక్‌ చేస్తూ లాక్‌డౌన్‌లో అలరించాడు. 'అలవైకుంఠపురంలో' చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో రాములా'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్ బ్లాక్‌' పాటలకు స్టెప్పులు ఇరగతీశాడు. అంతేగాక 'బాహుబలి' సినిమాలోని డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

ఇంటిరుచులతో కోహ్లీ

గత దశాబ్దంలోనే విరాట్ కోహ్లీ అత్యంత బిజీయెస్ట్ క్రికెటర్‌. కెప్టెన్‌గా, మేటి బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే కరోనా వల్ల అతడికి మంచి విరామం దక్కింది. తన భార్య అనుష్కశర్మతో కలిసి ఆ సమయాన్ని ఆస్వాదించాడు. ఇంటి భోజనాన్ని ఆస్వాదించాడు. అనుష్కతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడటం, తన మిత్రులతో కలిసి లైవ్ చాట్‌లో కబుర్లు చెప్పాడు. అంతేగాక పుస్తకాలు చదివాడు.

kohli
కోహ్లీ-అనుష్క

హిట్‌మ్యాన్‌ ముచ్చట్లు

ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన రోహిత్‌ శర్మ లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. గాయంతో హిట్‌మ్యాన్‌ తొలుత దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. కానీ కరోనా కారణంగా ఆ సిరీస్‌ రద్దవ్వడం, ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడం వల్ల.. పూర్తిగా కోలుకోవడానికి ఎంతో సమయం దొరికింది. అంతేగాక విదేశీ క్రికెటర్లతో హిట్‌మ్యాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ముచ్చటించాడు. డేవిడ్ వార్నర్‌, పీటర్సన్‌తో తన ఆలోచనలు, జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన గారాల పట్టి సమైరాతో, కుటుంబంతో కలిసి కాలక్షేపం చేశాడు.

rohith
రోహిత్​ శర్మ

చాహల్‌ పెళ్లి కబుర్లు

లాక్‌డౌన్‌లో యుజ్వేంద్ర చాహల్‌ తన జీవిత భాగస్వామిని అభిమానులకు పరిచయం చేశాడు. యూట్యూబర్‌ ధనశ్రీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేగాక తన తండ్రితో కలిసి స్టెప్పులు వేస్తూ సరదాగా వీడియోలు చేయడం, చెస్‌ ఆడటం చేశాడు. ఇటీవల యూజీ-ధనశ్రీ అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

chahl
చాహల్​ ధనశ్రీ

పాండ్యకు కొత్త బాధ్యతలు

హార్దిక్‌ పాండ్యకు 2020 ఎంతో స్పెషల్. తన జీవిత భాగస్వామిగా నటాషా స్టాంకోవిచ్‌ను ఎంచుకోవడం, తండ్రి కావడం ఈ ఏడాదే జరిగాయి. జనవరి 1న నటాషాకు సముద్ర జలాల్లో తన ప్రేమను హార్దిక్‌ వ్యక్తపరిచాడు. అనంతరం మేలో తాను తండ్రి కాబోతున్నానని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. జులై 30న తండ్రయ్యాడు. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని హార్దిక్ ఎంతో ఆస్వాదించాడు. తన ఫిట్‌నెస్ మెరుగుపర్చుకున్నాడు. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. అంతేగాక తన భార్య ప్రసవ సమయంలో తోడుగా ఉన్నాడు. భర్తగా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

hardik
హార్దిక్​ పాండ్యా

యువక్రికెటర్లకు యువీ మార్గనిర్దేశకం

లాక్‌డౌన్‌లో యువక్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్ శర్మకు యువరాజ్‌ సింగ్‌ మార్గనిర్దేశం చేశాడు. జిమ్‌ను సిద్ధం చేసి వాళ్లతో కలిసి కసరత్తులు చేశాడు. వాళ్లకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఆటలో మెరుగవ్వడానికి ఎంతో దోహదపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అంతేగాక ఎప్పటిలానే లాక్‌డౌన్‌లోనూ యువీ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నాడు. కరోనా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

రాహుల్‌కు పీడకలలు

ఈ ఏడాది ఆరంభంలో కేఎల్ రాహుల్ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. అయితే కరోనా కారణంగా కొన్ని నెలలు ఇంట్లోనే ఉండటం వల్ల తాను మునుపటిలా బ్యాటింగ్‌ చేస్తానో లేదోనని రాహుల్ కాస్త భయపడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. నిద్రలో కలలు వస్తున్నాయని చెప్పాడు. కాగా, లాక్‌డౌన్‌లో శారీరక కసరత్తులు చేశాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. తన పెంపుడు జంతువులతో కాలక్షేపం చేశాడు.

rahul
కేఎల్​ రాహుల్​

గబ్బర్‌.. ది ఫ్యామిలీ మ్యాన్‌

శిఖర్‌ ధావన్ లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. కుటుంబంతో కలిసి సరదా వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. భార్యతో జరిగే చిలిపి గొడవలను బాలీవుడ్ పాటలతో ఫన్నీగా చిత్రీకరించి వీడియోలు పంచుకున్నాడు. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్తకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయని హాస్యాన్ని పండించాడు. ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సుస్థిర స్థానం కోసం సాధన

యువ క్రికెటర్ సంజు శాంసన్ లాక్‌డౌన్‌లో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. అంతేగాక బ్యాటింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. టీమ్​ఇండియాలో సుస్థిర స్థానం సాధించాలని కసితో సాధన చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశాడు.

sanju samson
కసరత్తులు చేస్తున్న సంజు శాంసన్​

ఇదీ చూడండి : బైబై2020: ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు వీరివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.