ETV Bharat / sports

ప్రేయసిని పెళ్లాడిన భారత మిస్టరీ స్పిన్నర్​ - Varun Chakravarthy team india

యువ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసిని మనువాడాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు ఇన్​స్టా ద్వారా వెల్లడించాడు.

Cricketer Varun Chakravarthy gets married to his girlfriend
ప్రేయసిని పెళ్లాడిన భారత మిస్టరీ స్పిన్నర్​
author img

By

Published : Dec 12, 2020, 6:01 PM IST

కోల్‌కతా‌ జట్టు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో తన ప్రేయసితో ఏడడగులు వేశాడు. అయితే ఈ విషయాన్ని వరుణ్ వెల్లడించలేదు. అతడి స్నేహితుడు అరుణ్ కార్తిక్‌ ఇన్‌స్టాలో వరుణ్ పెళ్లి ఫొటో షేర్‌ చేయడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది.

Cricketer Varun Chakravarthy gets married
భార్యతో స్పిన్నర్​ వరుణ్ చక్రవర్తి

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కోల్‌కతా తరఫున ఆడిన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. దిల్లీతో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 6.84 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.

బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని బంతులు వేసే అతడు.. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ గాయంతో అతడు పర్యటనకు దూరమయ్యాడు. ఆ స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్ సత్తాచాటాడు. అయితే ప్రతిభకు కొదవలేని వరుణ్‌.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని సీనియర్‌ క్రికెటర్లు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండటంతో లెగ్‌ స్పిన్నర్‌ చక్రవర్తి కీలకమవుతాడని విశ్లేషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.