టీమిండియా క్రికెటర్ రోహిత్‌శర్మ నేడు హైదరాబాద్‌కు వచ్చాడు. చేగూర్ ప్రాంతంలోని 'హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్' వద్ద క్రికెట్ మైదానం, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమానికి తన సతీమణి రితికతో కలిసి హాజరయ్యాడు. దాజీగా పిలిచే ఆధ్యాత్మిక గురువు కమలేశ్ పాటిల్‌ను కలిశారు ఈ దంపతులు. కన్హా శాంతివనం ప్రధాన కార్యాలయం వద్ద ఈ వేడుక జరిగింది. నూతనంగా నిర్మించ తలపెట్టిన ఈ మైదానానికి 'రోహిత్ శర్మ క్రికెట్ స్టేడియం'గా నామకరణం చేశారు.
"కన్హా శాంతివనంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. పాజిటివ్ భావన కలిగింది. ప్రకృతితో అనుబంధం ఉంటేనే అలా ఉంటుంది. హార్ట్ఫుల్నెస్ యోగా కూడా బాగా ఉపయోగపడుతోంది. యోగా వల్ల మనుసు చాలా తేలికగా అనిపిస్తోంది."
-- రోహిత్‌శర్మ, క్రికెటర్
హార్ట్ఫుల్నెస్ అనేది రాజయోగాలోని ఒక రకం. ఇది 20వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1945లో శ్రీ రామ్ చంద్ర మిషన్ ద్వారా ఇది వ్యాప్తి చెందింది.
జనవరి 5 నుంచి శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతి నిచ్చారు సెలక్టర్లు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని కోహ్లీ, రోహిత్‌కు ఒత్తిడి లేకుండా ఒక్కొక్కరికి ఒక్కో సిరీస్‌కు విశ్రాంతినిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు విరాట్‌ను ఎంపిక చేయలేదు టీమిండియా యాజమాన్యం.