ETV Bharat / sports

వ్యాక్సిన్ వస్తే అంతా మారిపోతుంది: గంగూలీ - telugu sports news

కరోనా సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్​ మళ్లీ కొత్తరూపు సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఓ వెబినార్​లో పాల్గొన్న ఆయన.. త్వరలో క్రికెట్​ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐసీసీతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

BCCI Chief Sourav Ganguly
గంగూలీ క్రికెట్​
author img

By

Published : May 31, 2020, 5:43 AM IST

కొవిడ్‌-19తో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. వ్యాక్సిన్​ వచ్చాక పరిస్థితి సాధారణంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మార్చి నుంచి క్రికెట్​ నిలిచిపోగా.. త్వరలో మళ్లీ ఆటలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అనుకోకుండా తాను క్రికెటర్‌గా మారానని వెల్లడించారు.

"కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇప్పటికైతే ఔషధాలు లేవు. కానీ ఆరు, ఏడు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తే అంతా మారిపోతుంది."

-సౌరభ్​ గంగూలీ

"మనలో ప్రతిఘటించే శక్తి చాలా ఉంది. క్రికెట్‌ సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నా. షెడ్యూలులో కొన్ని మార్పులుంటాయి. బీసీసీఐ, ఐసీసీ కలిసి క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. క్రికెట్‌ అత్యంత శక్తివంతమైంది. ఆటగాళ్లకు కొన్ని పరీక్షలు ఉండొచ్చు. వ్యాక్సిన్‌ వస్తే అంతా మెరుగవుతుంది" అని గంగూలీ పేర్కొన్నారు.

ఇప్పటికే క్రికెట్​ పునరుద్ధరణకు ఇంగ్లాండ్​ చర్యలు చేపట్టిందని.. భారత్​ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు గంగూలీ. ఇందుకోసం నూతన మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నట్లు తెలిపారు.

అలా ఆటలోకి వచ్చా...

ఓ ప్రైవేటు వెబినార్​లో పాల్గొన్న దాదా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు ఫుట్‌బాలే తన జీవితమని అకస్మాత్తుగా క్రికెటర్‌గా మారానని ఆయన అన్నారు. వేసవిలో ఇంట్లో ఏమీ చేయడం లేదని తన తండ్రి క్రికెట్‌ అకాడమీకి వెళ్లమన్నారని తెలిపారు. ఇంట్లో సోదరులు, సోదరీమణులు, పెద్దవారు ఎక్కువ క్రమశిక్షణగా ఉండటం వల్ల వారికి దూరంగా ఉండొచ్చని వెళితే అకాడమీ బాగా నచ్చిందన్నారు. వయసు ఆధారిత మ్యాచులో ఒడిశాపై శతకం చేసిన సంగతిని దాదా గుర్తు చేసుకున్నారు. జట్టులో చాలామంది అనారోగ్యం బారిన పడటం వల్లే అనుకోకుండా ఆ అవకాశం వచ్చిందన్నారు. లార్డ్స్‌లో శతకం చేయడం తనకో మధురస్మృతిగా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.