ప్రపంచకప్ కోసం అన్ని జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి. టోర్నీ గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే జట్లు ప్రకటించినా.. బరిలోకి దిగే తుది ఆటగాళ్లపై కసరత్తు చేస్తున్నాయి. రిజర్వ్ ఆటగాళ్లను జట్టులోకి పిలుస్తున్నాయి. తాజాగా విండీస్ క్రికెట్ బోర్డు 10 మందితో రిజర్వ్ బెంచ్‌ను ప్రకటించింది. ఇందులో పొలార్డ్, డ్వేన్ బ్రావో ఉండటం విశేషం. ప్రపంచకప్ తుదిజట్టులో ఉన్న 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరికి అవకాశం దక్కుతుంది. 2018లోనే బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కానీ అతడి అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంది విండీస్ క్రికెట్ బోర్డు.
మెగాటోర్నీకి ముందు ఐసీసీ నిర్వహించే రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో విండీస్ పాల్గొంటుంది. మే 26న దక్షిణాఫ్రికా, 28న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్ తొలిపోరులో 31న పాకిస్థాన్‌తో తలపడుతుంది.
-
CRICKET WEST INDIES ANNOUNCE WORLD CUP CAMP AND RESERVE PLAYERS LIST #CWC19https://t.co/97JSVZrDvN
— Windies Cricket (@windiescricket) May 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">CRICKET WEST INDIES ANNOUNCE WORLD CUP CAMP AND RESERVE PLAYERS LIST #CWC19https://t.co/97JSVZrDvN
— Windies Cricket (@windiescricket) May 18, 2019CRICKET WEST INDIES ANNOUNCE WORLD CUP CAMP AND RESERVE PLAYERS LIST #CWC19https://t.co/97JSVZrDvN
— Windies Cricket (@windiescricket) May 18, 2019
విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితా
సునిల్ అంబ్రిస్, డ్వేన్ బ్రావో, జాన్ క్యాంప్‌బెల్, జొనాథన్ కార్టర్, రోస్టన్ చేస్, షేన్ డోవ్రిచ్, కీమో పాల్, ఖారే పియరే, రేమన్ రీఫర్, కీరన్ పొలార్డ్.
ఇవీ చూడండి.. 'అప్పుడు వికెట్లు తీస్తే గెలుపు టీమిండియాదే'