1989, నవంబర్ 15.. సచిన్ తెందూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోజు. 16 ఏళ్ల వయసున్న లిటిల్ మాస్టర్... పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. పిన్న వయసులోనే బ్యాట్ పట్టిన ఈ దిగ్గజం.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తనదైన ఆటతీరుతో ఒక్కో మెట్టు ఎదుగుతూ... చివరికి టెస్టులు ఆడిన ప్రతి దేశంపై సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
మూగబోయిన మైదానం...
నవంబర్ 15వ తేదీన సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించగా.. 2013, నవంబర్ 16న తన టెస్టు క్రికెట్‌కు ముగింపు పలికాడు. వెస్టిండీస్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చివరిగా తెలుపు జెర్సీలో కనిపించాడు మాస్టర్. ఈ మ్యాచ్ నవంబర్ 14న ప్రారంభమై.. నవంబర్16న మూడు రోజుల్లోనే ఫలితం తేలిపోయింది. 126 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. చివరి టెస్టులో 74 పరుగులు చేశాడు సచిన్. ఆ మ్యాచ్ అనంతరం అభిమానులు, ఆటగాళ్ల అభివాదం, కరతాల ధ్వనుల మధ్య సుదీర్ఘ ఆటకు వీడ్కోలు పలికాడు మాస్టర్ బ్లాస్టర్.
-
After...
— Sach Boy🇮🇳 (@LoyalSachinst) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
664 matches
34,357 runs
100 centuries
164 fifties
201 wickets
2 five-wicket hauls
256 catches#OnThisDay in 2013, the great @sachin_rt retired from international cricket 🙌#ThankYouSachin pic.twitter.com/JoTnOvbs3R
">After...
— Sach Boy🇮🇳 (@LoyalSachinst) November 16, 2019
664 matches
34,357 runs
100 centuries
164 fifties
201 wickets
2 five-wicket hauls
256 catches#OnThisDay in 2013, the great @sachin_rt retired from international cricket 🙌#ThankYouSachin pic.twitter.com/JoTnOvbs3RAfter...
— Sach Boy🇮🇳 (@LoyalSachinst) November 16, 2019
664 matches
34,357 runs
100 centuries
164 fifties
201 wickets
2 five-wicket hauls
256 catches#OnThisDay in 2013, the great @sachin_rt retired from international cricket 🙌#ThankYouSachin pic.twitter.com/JoTnOvbs3R
ట్రాక్ రికార్డు...
అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు ఆడిన సచిన్.. 51 సెంచరీలు, 68 అర్ధశతకాలు చేశాడు. మొత్తం 329 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్... 15వేల 291 పరుగులు చేసి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 53.78 సగటు నెలకొల్పాడు మాస్టర్.
కెరీర్‌లో 463 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్... 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు నమెదు చేశాడు. వన్డేల్ తెందూల్కర్ 44.38 సగటుతో 18వేల 426 పరుగులు చేశాడు.
టీమిండియా తరఫున మొత్తం 664 మ్యాచ్‌లు ఆడిన ఈ దిగ్గజం.. 34వేల 357 పరుగులు చేశాడు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధశతకాలు, 201 వికెట్లు, 256 క్యాచ్‌లు, 2సార్లు ఐదేసి వికెట్లు.. మాస్టర్ ఖాతాలో ఉన్నాయి.