ETV Bharat / sports

'సచిన్​ను డకౌట్ చేయడమే నాకు కలిసొచ్చింది'​

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ను డకౌట్​ చేసిన కారణంగానే తన అసలైన కెరీర్​ ప్రారంభమైందని అంటున్నాడు టీమిండియా బౌలర్​ భువనేశ్వర్​. ఆ పరిణామం తర్వాతే అందరి దృష్టి తనపై మరలిందని తెలిపాడు.

Cricket news: Bhuvneshwar Kumar Reminisces Having Dismissed Sachin Tendulkar For A Duck In Ranji Trophy
'సచిన్​ను డకౌట్ చేయటమే నాకు కలిసొచ్చింది'​
author img

By

Published : Mar 22, 2020, 9:03 AM IST

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందుల్కర్‌ను డకౌట్‌ చేయడమే తన కెరీర్‌ను మార్చిందని పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు. 2008 రంజీ సీజన్లో సచిన్‌ను ఇన్‌స్వింగ్ బంతితో ఔట్‌ చేయడం వల్ల అందరి దృష్టి 18 ఏళ్ల భువీ మీద పడింది. అప్పటి వరకు దేశవాళీ క్రికెట్లో సచిన్‌ డకౌట్‌ కాలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో ఈ విషయంపై భువీ స్పందించాడు.

"డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి సచిన్‌ మైదానంలోకి వస్తున్నప్పుడు నేను బౌలింగ్‌ మార్క్‌ దగ్గర ఉన్నా. అతణ్ని అలా చూస్తూ ఉండిపోయా. సచిన్‌ను ఔట్‌ చేశాక ఆ విషయాన్ని నమ్మలేకపోయా. వికెట్‌ తీయడం నాకేమీ కొత్త కాదు.. కానీ నేను ఔట్‌ చేసింది తెందుల్కర్‌ని అని గుర్తించడానికి కొంచెం సమయం పట్టింది. నేను సాధించిన పెద్ద ఘనత ఇది. అప్పటి నుంచే జనం నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నా కెరీర్లో నేనేమీ సాధించినా అంతా ఆ వికెట్‌ తర్వాతే. అప్పటివరకు అనామక ఆటగాడిగా ఉన్న నాపై అందరి దృష్టి పడింది. ఎవరా కుర్రాడు అని ఆసక్తిగా చర్చించుకున్నారు"

- భువనేశ్వర్ కుమార్​, టీమిండియా ఆటగాడు

2012 డిసెంబర్‌లో పాకిస్థాన్‌పై వన్డే, టీ20 అరంగేట్రం చేసిన ఈ పేసర్‌.. 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి.. "నా ఫేస్​బుక్​ అకౌంట్ హ్యాక్​ చేసింది ఈ అమ్మాయే"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.