ETV Bharat / sports

ఆరంభం, అంతిమం ఒక్కటైన వేళ..! - Charl Langeveldt

టీమిండియా తొలి అంతర్జాతీయ టీ20 డిసెంబర్​ 1, 2006న ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్​లో గెలిచి ఎన్నో విశేషాలను నమోదు చేసింది.

cricket historic day: December 1 in 2006, India played their first ever Twenty20 International at Johannesburg against South Africa
13 ఏళ్ల క్రితం ముగించిన చోటే ఆరంభం...
author img

By

Published : Dec 1, 2019, 2:44 PM IST

డిసెంబర్​ 1, 2006.. భారత క్రికెట్​ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ ఏకైక టీ20 మ్యాచ్​ ఆడింది ఈరోజే. అదే టీమిండియాకు తొలి అంతర్జాతీయ టీ20 కావడం విశేషం.

తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో తలపడింది టీమిండియా​. ఈ ఫార్మాట్​లో ప్రపంచ వ్యాప్తంగా ఇది పదో మ్యాచ్​. దీనికి వీరేంద్ర సెహ్వాగ్​ సారథ్యం వహించాడు. ఈ జట్టులో సచిన్​, మహేంద్ర సింగ్​ ధోనీ, సురేశ్​ రైనా, హర్భజన్​ సింగ్​ ఉన్నారు. ఈ మ్యాచ్​లో భారత్​ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దినేశ్​ కార్తీక్​ 31* పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ కైవసం చేసుకున్నాడు.

మ్యాచ్​ సాగిందిలా...

గ్రేమ్​ స్మిత్​ సారథ్యంలోని దక్షిణాఫ్రికా టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. జహీర్​ ఖాన్, అజిత్​ అగార్కర్​ చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా.. సచిన్​, హర్భజన్​, శ్రీశాంత్​ తలో వికెట్​ సాధించారు.

రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఆరంభం అంతగా కలిసిరాలేదు. సచిన్​ 10 పరుగులకే ఔటయ్యాడు. సెహ్వాగ్(34) మరో బ్యాట్స్​మన్​ మోంగియాతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్​లో ధోనీ డకౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం మోంగియా, దినేశ్​ కార్తీక్​ కాసేపు పోరాడారు. ఆఖర్లో మోంగియా ఔటైనా... రైనా వచ్చి మ్యాచ్​ ముగించేశాడు.

సచిన్​ ఆడిన ఒకే ఒక్క మ్యాచ్​..

రికార్డుల రారాజు, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​కు టీ20 ఆడాలన్న కోరిక తీరింది ఆరోజే. కానీ మ్యాచ్​ తర్వాత ఇంకెప్పుడూ అంతర్జాతీయ టీ20 ఆడలేదు మాస్టర్​. ఈ మ్యాచ్​లో 10 పరుగులే చేసి నిరాశపర్చాడు.

జట్టు ఇదే...

వీరేంద్ర సెహ్వాగ్​(కెప్టెన్​), సచిన్​ తెందూల్కర్​, దినేశ్​ మోంగియా, ఎమ్​ఎస్​ ధోనీ(కీపర్​), దినేశ్​ కార్తీక్​, సురేశ్​ రైనా, ఇర్ఫాన్​ పఠాన్​, హర్భజన్​ సింగ్​, జహీర్​ ఖాన్​, అజిత్​ అగార్కర్​, శ్రీశాంత్​

ఈ మ్యాచ్​ జరిగిన తర్వాతి ఏడాది 2007లో ఐసీసీ టీ20 ప్రపంచకప్​.. దక్షిణాఫ్రికాలో జరిగింది. ధోనీ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో పాకిస్థాన్​ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mumbai, Dec 01 (ANI): Bollywood actors Kartik Aaryan, Ananya Panday and Bhumi Pednekar are busy promoting their upcoming film, 'Pati Patni Aur Woh' in Mumbai on November 30. The trio was spotted spreading word about the romantic-comedy while doing club hopping. Club hopping is an action of making a series of short visits to nightclubs. Bhumi looked stylish in her black outfit. Kartik was wearing casual shirt, while Ananya was spotted in glittery short bodycon dress. 'Pati Patni Aur Woh' is a remake of the hit 1978 film of the same name. The movie was about a philandering husband, who is exposed by his wife and girlfriend. The movie is directed by Mudassar Aziz and set to hit theatres on December 06.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.