ETV Bharat / sports

టీమిండియాను అనుమతించేద్దామా? లేదంటే కోట్ల నష్టం!

డిసెంబర్​లో టీమిండియాతో జరగాల్సిన నాలుగు టెస్టుల సిరీస్​ను కచ్చితంగా నిర్వహించే యోచనలో ఉంది ఆస్ట్రేలియా. లేదంటే దాదాపు రూ.1500కోట్ల నష్టాన్ని చవిచూడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాకు ప్రత్యేక ప్రయాణ సడలింపులు కల్పించే అవకాశముంది​.

cricket australia will definitely host team india series
టీంమిండియాను అనుమతించేద్దామా? లేదంటే రూ.1462 కోట్ల నష్టం!
author img

By

Published : Apr 26, 2020, 8:17 AM IST

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు గాను టీమ్‌ఇండియాకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక ప్రయాణ సడలింపులు కల్పించే అవకాశముంది. భారత్‌తో సిరీస్‌ జరగకుంటే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దాదాపు రూ.1462 కోట్ల నష్టం చవిచూడనుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న సీఏ.. 80 శాతం సిబ్బందిని తొలగించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నుంచి జనవరి మధ్యలో భారత్‌తో జరగాల్సిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కచ్చితంగా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.

ప్రస్తుతం ఆ దేశంలో సెప్టెంబర్‌ 30 వరకూ ప్రయాణ ఆంక్షలున్నాయి. ఈ ఆంక్షలను పొడిగించేందుకు ఆస్కారం ఉంది. అయితే భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు వీలుగా ఆంక్షలను సడలించే అవకాశం ఉందట. సీఏ చేసిన విజ్ఞప్తికి ఆ దేశ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమచారం. ప్రస్తుత ఆర్థిక చట్రంలో సుమారు రూ.2437 కోట్ల ఆదాయం రాబట్టాలని సీఏ అంచనా వేసింది. వాటిల్లో ప్రధానంగా ప్రసార హక్కుల ద్వారానే అధిక మొత్తం వస్తుంది. భారత్‌తో సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియాల్లోనైనా మ్యాచ్‌లు నిర్వహించాలని సీఏ భావిస్తోంది. దేశంలో క్రీడా కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని మోరిసన్‌ ఇటీవల పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అత్యుత్తమ ఆల్​రౌండర్లు వాళ్లే: సచిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.