ETV Bharat / sports

ఐపీఎల్​పై ఆశలు.. టోర్నీకి తగ్గట్లు ఆసీస్​ బోర్డు షెడ్యూల్​! - IPL 2020 latest news

కరోనా నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్​కు జీవం పోయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి ఐసీసీ సహా ఆయా క్రికెట్​ బోర్డులు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను విడుదల చేసింది ఆసీస్​ బోర్డు. ఇందులో రెండు నెలల సమయం ఖాళీగా ఉంచడం ఐపీఎల్​ నిర్వహణపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

Cricket Australia announce international schedule for 2020-21 season
ఐపీఎల్​పై ఆశలు.. మెగాటోర్నీకి తగ్గట్లు ఆసీస్​ బోర్డు షెడ్యూల్​!
author img

By

Published : May 29, 2020, 7:34 AM IST

ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు పర్యటన పూర్తి షెడ్యూల్​ను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం ప్రకటించింది. పర్యటనలో టీమ్‌ ఇండియా.. టెస్టులు, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌ కూడా ఆడనుండడం కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు గొప్ప ఊరటే. టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ల ద్వారా సుమారు రూ.1500 కోట్లు ఆర్జించాలన్నది సీఏ లక్ష్యం. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరులో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆసీస్‌లో కోహ్లీసేన పర్యటన ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్‌ అక్టోబరు 11న జరుగుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబరు 3న ఆరంభమయ్యే మొదటి టెస్టుకు బ్రిస్బేన్‌ ఆతిథ్యమివ్వనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జనవరి 17న జరిగే మూడో మ్యాచ్‌తో ఆసీస్‌లో టీమ్‌ఇండియా పర్యటన ముగుస్తుంది.

టీ20 సిరీస్‌కు తొలి టెస్టు ఆరంభానికి మధ్య నెలన్నర రోజుల విరామం ఉంది. ఈ సమయంలో షెడ్యూలు ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సివుంది. కానీ వాయిదా పడడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఐపీఎల్‌కు మార్గం సుగమవుతుందని భావిస్తున్నారు. జనవరిలో ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా మహిళల జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌ కూడా జరుగనుంది.

ఆసీస్‌లో భారత్‌.. టీ20 సిరీస్‌:

  • తొలి టీ20 : అక్టోబరు 11, బ్రిస్బేన్‌
  • రెండో టీ20 : అక్టోబరు 14, కాన్‌బెర్రా
  • మూడో టీ20 : అక్టోబరు 17, అడిలైడ్‌

టెస్టు సిరీస్‌:

  • తొలి టెస్టు : డిసెంబరు 3-7, బ్రిస్బేన్‌
  • రెండో టెస్టు : డిసెంబరు 11-15, అడిలైడ్‌ (డేనైట్‌)
  • మూడో టెస్టు : డిసెంబరు 26-30, మెల్‌బోర్న్‌
  • నాలుగో టెస్టు : జనవరి 3-7, సిడ్నీ

వన్డే సిరీస్‌:

  • తొలి వన్డే : జనవరి 12, పెర్త్‌
  • రెండో వన్డే : జనవరి 15, మెల్‌బోర్న్‌
  • మూడో వన్డే : జనవరి 17, సిడ్నీ

మహిళల వన్డే సిరీస్:‌

  • తొలి మ్యాచ్‌ : జనవరి 22, కాన్‌బెర్రా
  • రెండో మ్యాచ్‌ : జనవరి 25, మెల్‌బోర్న్‌
  • మూడో మ్యాచ్‌ : జనవరి 28, హోబర్ట్‌

ఐపీఎల్​ 13వ సీజన్​ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. అయితే ఇది అక్టోబర్​-డిసెంబర్​ మధ్యలో జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా బోర్డు షెడ్యూల్​ వాటికి మరింత బలం చేకూరుస్తోంది.

ఇదీ చూడండి: 'నాన్​హానర్స్​' బోర్డు.. ఆ గౌరవం దక్కని వారి కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.