ETV Bharat / sports

కరోనా దెబ్బకు క్యాబ్ ఆఫీస్ మూసివేత

కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​లోని క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ)లో కరోనా కేసు కలకలం రేపింది. కార్యాలయ సివిల్ ఇంజినీరింగ్​ శాఖలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగికి వైరస్​ సోకిందని సీఏబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఆఫీస్​ను వారం రోజులపాటు మూసేస్తున్నామని సీఏబీ అధ్యక్షుడు తెలియజేశారు.

Cricket Association Of Bengal Office At Eden Gardens Shuts Down After Worker Tests Positive For Coronavirus
కరోనా దెబ్బకు బంగాల్​ క్రికెట్​ అసోసియేషన్ మూసివేత
author img

By

Published : Jul 5, 2020, 11:27 AM IST

క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ) కార్యాలయంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆఫీస్​ను వారంపాటు తాత్కాలికంగా మూసేస్తున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో ఓ కాంట్రాక్టు ఉద్యోగికి వైరస్​ సోకిందని వారు తెలియజేశారు.

"సివిల్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో చందన్ దాస్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నాడు. అతను శాశ్వత ఉద్యోగి కాదు. అతడికి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా అతడు విధులకు హాజరు కాకపోయినా.. వైద్యుల సలహా మేరకు వారం రోజులపాటు తాత్కాలికంగా సీఏబీ కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయించాం".

- అవిషేక్​ దాల్మియా, సీఏబీ ప్రెసిడెంట్​

క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ కార్యాలయాన్ని అధికారికంగా ఓపెన్ చేయలేదని.. చట్టబద్ధమైన పనులకు, వాటాదారుల బకాయిలు తీర్చడానికి పరిమిత సిబ్బందితో అప్పుడప్పుడు తెరుస్తున్నామని అవిషేక్​ దాల్మియా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.