ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలేపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌథాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో క్రాలే అద్భుత బ్యాటింగ్‌తో 267 పరుగులు చేయడం పట్ల స్పందించాడు దాదా.
-
England have found a very good no 3 in Crawley.. looks a class player .. hope to see him in all formats regularly @nassercricket @ECB_cricket
— Sourav Ganguly (@SGanguly99) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">England have found a very good no 3 in Crawley.. looks a class player .. hope to see him in all formats regularly @nassercricket @ECB_cricket
— Sourav Ganguly (@SGanguly99) August 22, 2020England have found a very good no 3 in Crawley.. looks a class player .. hope to see him in all formats regularly @nassercricket @ECB_cricket
— Sourav Ganguly (@SGanguly99) August 22, 2020
"ఇంగ్లాండ్‌కు మూడో స్థానంలో క్రాలే రూపంలో మంచి బ్యాట్స్‌మన్ దొరికాడు. అతడో క్లాస్ ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఇకపై అతడ్ని అన్ని ఫార్మాట్లలో చూడాలని ఆశిస్తున్నా."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన జాక్ క్రాలే మూడో స్థానంలో బరిలో దిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 393 బంతుల్లో 267 పరుగులు నమోదు చేశాడు.
వికెట్ కీపర్ జాస్ బట్లర్ 152 రన్స్‌తో రాణించాడు. బట్లర్, క్రాలే కలిసి 359 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.