కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విశేషకరమైన, వింతైన వికెట్ సెలబ్రేషన్ అభిమానుల్ని ఆకట్టుకుంది. గురువారం రాత్రి గయానా వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ జట్ల మధ్య 26వ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా గయానా బౌలర్ కెవిన్ సింక్లెయిర్.. బార్బడోస్ బ్యాట్స్‌మన్ మిచెల్ శాంట్నర్(18)ను 16వ ఓవర్ చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆనందం పట్టలేకపోయిన కెవిన్.. అమాంతం గాల్లోకి ఎగిరి మూడు పల్టీలు కొట్టాడు. అది చూసిన వ్యాఖ్యాతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
-
Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy
— CPL T20 (@CPL) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy
— CPL T20 (@CPL) September 3, 2020Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy
— CPL T20 (@CPL) September 3, 2020
దీనికి సంబంధించిన వీడియోను కరీబియన్ ప్రీమియర్ లీగ్ ట్విట్టర్లో పంచుకుంది. అది చూసిన నెటిజన్లు అయోమయానికి గురయ్యారు. క్రికెట్‌లో వికెట్ పడితే ఇలా కూడా చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. గతంలోనూ ఈ కరీబియన్ లీగ్‌లో వింతైన వికెట్ సెలబ్రేషన్స్ చోటుచేసుకున్నాయి.
ఒక విండీస్ బౌలర్ గతేడాది వికెట్ తీసిన సందర్భంలో మైదానంలోనే మ్యాజిక్ షోలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ నిర్ణీత 20 ఓవర్లలో 89/9 స్వల్ప స్కోరు మాత్రమే చేసింది. అనంతరం గయానా ఆడుతూ పాడుతూ 14.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.