కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న వారికి మద్దతుగా గుండు చేసుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, జో బర్న్స్, ట్రవిస్ స్మిత్, పీర్స్ మోర్గాన్, ఆడం జంపా, మార్కస్ స్టోయినిస్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలను కోరాడు.
"కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడే వారికి నా మద్దతు తెలుపుతున్నా. దానికి గుర్తుగా నా తలపై ఉన్న వెంట్రుకలను ట్రిమ్ చేసుకున్నా. ఈ ఛాలెంజ్‌ను నేనే ప్రారంభించా" అని తెలిపాడు వార్నర్. కరోనా వైరస్ వల్ల ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 19 మంది మరణించగా.. 4,514 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చూడండి.. రోహిత్ తనకు ఆదర్శమంటోన్న పాక్ క్రికెటర్