ETV Bharat / sports

విరాళాల సేకరణకు క్రికెటర్ స్టోక్స్ హాఫ్ మారథాన్

బ్రిటన్ ఆసుపత్రులకు విరాళమిచ్చేందుకు 21 కిలోమీటర్ల దూరం పరుగెత్తనున్నాడు ఆల్​రౌండర్ స్టోక్స్. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

విరాళాల సేకరణ కోసం స్టోక్స్ హాఫ్ మారథాన్
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్
author img

By

Published : May 5, 2020, 2:04 PM IST

కరోనా కట్టడి కోసం పోరాడుతున్న ఆసుపత్రులకు విరాళాలు అందించేందుకు సిద్ధమయ్యాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్. ఇందులో భాగంగా నేడు తొలిసారిగా, హాఫ్ మారథాన్(21 కిలోమీటర్లు) పూర్తి చేయనున్నాడు. తద్వారా వచ్చిన మొత్తాన్ని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల విభాగంతో పాటు ఛాన్స్ టు షైన్ ఫౌండేషన్​కు అందించనున్నాడు. ఈ విషయం చెబుతూ ఇన్​స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.

ఈ హాఫ్ మారథాన్​ గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానని, ఇదే మంచి అవకాశమని చెప్పాడు స్టోక్స్. ఈ క్రికెట్ గార్డెన్ మారథాన్​కు ప్రజలు ఎక్కువ సంఖ్యలో విరాళాలు అందించేలా, వారికి స్ఫూర్తి కలిగిస్తానని అన్నాడు.

తాజాగా ప్రపంచ విజ్డెన్ లీడింగ్ క్రికెటర్​గా నిలిచిన స్టోక్స్.. 2005 తర్వాత ఈ ఘనత సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ అప్పుడు ఈ పురస్కారం దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లోనూ అదరగొట్టిన స్టోక్స్.. తమ జట్టు తొలిసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 'ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​'గాను నిలిచాడు.

Ben Stokes to run half marathon
ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.