కరోనా కారణంగా తాను పడిన బాధలను చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్. 'కనీసం 20, 30 మీటర్లు పరిగెత్తలేకపోయాను.. ఏదైనా పని 2, 3 నిమిషాలు చేస్తే హార్ట్‌బీట్ ఎక్కువయ్యేది' అని ఈ వికెట్ కీపర్ తెలిపాడు. గత డిసెంబర్ 3న ఇంగ్లాండ్‌తో సిరీస్ సందర్భంగా క్లాసెన్ కొవిడ్ బారిన పడ్డాడు.
కరోనా నిర్ధరణ అయిన తర్వాత 16, 17 రోజులు నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే అప్పుడు వ్యాయామం కూడా చేయలేదు. మళ్లీ వ్యాయామం ప్రారంభించాలనుకున్నాను. కానీ, నేను కనీసం 20, 30 మీటర్లు కూడా పరిగెత్తలేకపోయాను.
-హెన్రిచ్ క్లాసెన్, దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్.
క్రికెట్ సౌతాఫ్రికా విధించిన 'రిటర్న్ టు ప్లే' ప్రణాళికను తాను అనుసరించలేదని క్లాసెన్ ఒప్పుకొన్నాడు. 'అందువల్లే తన హార్ట్ బీట్ నియంత్రణలోకి రావడానికి చాలా సమయం పట్టిందని తెలిపాడు. పనిఒత్తిడిని జయించడానికి బోర్డు చాలా నిబంధనలు విధించింది. నేను వాటికి కట్టుబడి ఉండలేదు. అది చాలా తేలికైన కార్యక్రమం. ఒకరోజులో కేవలం 10-15 నిమిషాలు వ్యాయామం చేయడం, 200 మీటర్లు నడవడం' వంటి మార్గదర్శకాలను బోర్డు విధించిందని క్లాసెన్ పేర్కొన్నాడు.
మహమ్మారి నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న క్లాసెన్.. గురువారం నుంచి పాకిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తమ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఇదీ చదవండి: 'టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టూ కోరుకోదు'