కెరీర్ సాఫీగా సాగి ఉంటే భారత్ తరఫున అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగేవాడినని చెప్పాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కొన్ని కారణాల వల్ల అది గాడితప్పిందని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తన కెరీర్ గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.
"రికార్డుల పరంగా నేను సాధించాల్సింది చాలా ఉంది. అనుకున్నట్లు జరిగి ఉంటే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా అయ్యేవాడిని. కానీ నా విషయంలో అలా జరగలేదు. గాయాలు బాధించడం వల్ల భారత్ తరఫున చివరగా 28 ఏళ్ల వయసులో ఆడాను. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాను. ఒకవేళ 35 ఏళ్ల వరకు క్రికెట్లో ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. అయితే ఇప్పటివరకు నేను ఆడిన ప్రతిమ్యాచ్‌లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచాను"
-ఇర్ఫాన్ పఠాన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
పేసర్ అదరగొట్టిన ఇర్ఫాన్.. వేగంగా 100 వికెట్ల మైలురాయిని(59 మ్యాచ్‌ల్లో) అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డును 13 ఏళ్ల తర్వాత షమి అధిగమించాడు. 2012 అక్టోబర్‌లో చివరగా టీమిండియా తరఫున ఆడిన ఇతడు... 29 టెస్టుల్లో 1105 పరుగులు చేసి 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 1544 పరుగులతో పాటు 173 వికెట్లు పడగొట్టాడు. 24 టీ20ల్లో 172 పరుగులు చేసి 28 వికెట్లు దక్కించుకున్నాడు. గతేడాది అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
2006లో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ తీసిన ఏకైక భారత పేసర్‌గా ఇర్ఫాన్ పఠాన్ రికార్డు సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఇది చూడండి : 'లార్డ్స్‌లో తొలి శతకం.. నా జీవితంలో గొప్ప క్షణాలు'