టీ20 ప్రపంచకప్‌లో బలమైన ఆస్ట్రేలియాపై గెలిచి, బోణీ కొట్టిన భారత మహిళా జట్టు.. రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్రూప్-ఏలోని బంగ్లాదేశ్‌తో నేడు.. పెర్త్ వేదికగా తలపడనుంది.
బంగ్లా జట్టును 2018లో జరిగిన ఆసియా కప్‌లో రెండు సార్లు ఓడించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పుడూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది హర్మన్‌సేన.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో భారత్ 3, బంగ్లాదేశ్ 2 గెలిచాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు నాకౌట్ అవకాశాలు మెరుగవుతాయి.
గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 132 పరుగులు చేసిన భారత్.. ఈరోజు మరింత ధాటిగా ఆడాలని చూస్తోంది. సమష్టిగా రాణించాలని భావిస్తోంది. అదేవిధంగా బంగ్లా జట్టు.. టీమిండియాపై గెలిచి, రేసులో నిలవాలని అనుకుంటోంది.