ETV Bharat / sports

రవిశాస్త్రిని తప్పించండి- దాదాకు నెటిజన్ల అభ్యర్థన - భారత్​ వర్సెస్​ ఆస్ట్రేలియా తొలి టెస్టు

అడిలైడ్​ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్​​ఇండియా ఘోర పరాజయం పట్ల భారత అభిమానులు నెట్టింట తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమికి ప్రధానకారణం భారత కోచ్​ రవిశాస్త్రి అని ఆరోపించారు. కోచ్​గా రవిశాస్త్రి స్థానంలో రాహుల్​ ద్రవిడ్​ లేదా అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐకి సూచనలిస్తున్నారు.

Coach Ravi Shastri Faces Fans' Ire On Social Media After Eight-Wicket Loss In Adelaide
రవిశాస్త్రిని కోచ్​గా తప్పించాలంటూ నెటిజన్ల సూచన!
author img

By

Published : Dec 20, 2020, 7:28 AM IST

Updated : Dec 20, 2020, 9:58 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్‌ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనను కోచ్‌గా తొలగించి రాహుల్ ద్రవిడ్‌ లేదా అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. దయచేసి భారత క్రికెట్‌ను రక్షించండి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని అభ్యర్థిస్తున్నారు.

అడిలైడ్‌ వేదికగా జరిగిన గులాబి టెస్టు తొలి రెండు రోజులు ఆసక్తికరంగా సాగింది. విరాట్‌ కోహ్లీ (74), ఛెతేశ్వర్‌ పుజారా (43), అజింక్య రహానె (42) రాణించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 244 పరుగులు చేసింది. ఇదే తక్కువ స్కోరని భావిస్తే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 191 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (4), ఉమేశ్‌ యాదవ్‌ (3), బుమ్రా (2) ఆ జట్టును దెబ్బకొట్టారు. 50+ ఆధిక్యం లభించడం వల్ల టీమ్‌ఇండియా గెలుపునకు బాటలు వేసుకుంటుందని అంతా అనుకున్నారు.

ఇందుకు విరుద్ధంగా కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో కేవలం 36 పరుగులకే చాప చుట్టేసింది. ఒక్క బ్యాట్స్‌మన్‌ సైతం రెండంకెల పరుగులు చేయలేదు. జోష్‌ హేజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 చుక్కలు చూపించారు. భారత్‌ ఘోర పరాజయం పాలవ్వడానికి కారణం రవిశాస్త్రినే అని నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

Last Updated : Dec 20, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.