ETV Bharat / sports

'రెండు జట్లను మైదానంలోకి దించే సత్తా భారత్​ సొంతం'

author img

By

Published : Mar 10, 2021, 2:46 PM IST

బయె బబుల్​ వల్ల టీమ్​ఇండియాకు లాభం చేకూరిందని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ప్రస్తుతం రెండు జట్లను బరిలోకి దించే సత్తా భారత్​కు ఉందని పేర్కొన్నాడు.

coach ravi shastri comments on teamindia performance
'రెండు జట్లను మైదానంలోకి దించే సత్తా భారత్​ సొంతం'

బయో బబుల్​లో ఉండటం కష్టమే.. అయినప్పటికీ ఈ విధానం వల్ల టీమ్‌ఇండియాకు మాత్రం మేలే జరిగిందని కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. ఆర్నెళ్ల నుంచి ఎవరూ ఊహించని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి ప్రస్తుతం‌ రెండు జట్లను పంపగల సత్తా భారత్ సొంతమని వెల్లడించాడు.

"టీమ్‌ఇండియాకు ఇంతమంది క్రికెటర్లు ఆడగలరని ఆర్నెళ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. విదేశీ పర్యటనలకు భారీ బృందంగా వెళ్లడం​ వల్ల టీమ్​ఇండియాకు మేలే జరిగింది. సాధారణంగా 17-18 మంది ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు ఎంపిక చేస్తారు. బయో బబుల్​, కరోనా ఆంక్షల వల్ల ఈ సారి 25-30 లేదా అంతకన్నా ఎక్కువమందితో వెళ్తున్నాం. దీంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు కూలంకషంగా ఆలోచించాల్సి వస్తోంది. అదృష్టమో, దురదృష్టమో మేం 30 మందితో ఆడాల్సి వచ్చింది. ఎవరు బాగా ఆడతారు ఎవరు ఆడరో తెలిసింది. ఈ విధానం బాగా పని చేసింది" అని రవిశాస్త్రి అన్నాడు.

ప్రస్తుత ప్రదర్శనలను బట్టి చూస్తే భవిష్యత్తులో రెండు వేర్వేరు జట్లను భారత్‌ మైదానంలోకి దించగలదనిపిస్తోందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2021లో తీరిక లేని షెడ్యూలుతో సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చినా ఇబ్బందేమీ ఉండదని పేర్కొన్నాడు. "ఇలాంటివి మనం ఊహించలేం. కానీ పరిస్థితులు వాటిని నిజం చేశాయి. అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్న కుర్రాళ్లను చూస్తే సంతోషమేస్తోంది. ఇప్పుడు భారత్‌ రెండు జట్లను బరిలోకి దించగలదు" అని ఆయన వెల్లడించాడు.

ఇదీ చదవండి: ఏడాది తర్వాత కోర్టులోకి ఫెదరర్​-ఇవాన్స్​తో ఢీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.